ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తెలుగు మీడియా ప్రెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఒక డైరెక్టర్ హీరోను ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఆ సినిమానే పుష్ప అని స్పష్టం చేశాడు. దర్శకుడు సుకుమార్ కెరీర్‌లో పుష్ప అనేది ఒక సినిమా కాదని.. తన మీద ప్రేమను చూపించుకోవడానికే తీసిన సినిమా లాగా ఉంటుందన్నాడు. తెలుగు మీడియాతో మాట్లాడుతుంటే తనకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. సాధారణంగా కొంతమంది వ్యక్తులే తనకు నచ్చుతారని… అలాంటి వ్యక్తుల్లో రష్మిక ఒకరు అని బన్నీ చెప్పాడు. రష్మిక చాలా తెలివైన అమ్మాయి అని.. డౌన్ టు ఎర్త్ ఉంటుందని బన్నీ ప్రశంసించాడు. ఈ మాటలు ఆడియో ఫంక్షన్‌లోనే చెప్పాలి కానీ ఆరోజు తనకు కుదరలేదని వివరించాడు. పుష్ప సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్‌లో రష్మిక చాలా అద్భుతంగా నటించిందన్నాడు.
Read Also: విశాల్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ
మరోవైపు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి హీరో అల్లు అర్జున్ గుర్తుచేసుకున్నాడు. తమ ఇద్దరి ప్రయాణం ఇప్పటిది కాదని… 2004లో మొదలైందని… అది 2010 తర్వాత కొనసాగిందని.. ఇప్పుడు 2020 తర్వాత కూడా కొనసాగుతుందని.. ఇలా మూడు దశాబ్ధాల నుంచి తమ ప్రయాణం సాగుతూనే ఉందని.. దేవి ఇలానే సినిమాలు చేస్తే మరో దశాబ్దం పాటు కూడా తాము కలిసి పనిచేస్తామంటూ బన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా గురించి తనకు సుక్కు చెప్పగానే చాలా ఉత్సాహం వేసిందని… ఎలాగైనా ఈ సినిమాతో తనను తాను నిరూపించుకోవాలనే కసి పెరిగిందని.. ఆలౌట్ వెళ్లిపోవాలని ఫిక్స్ అయిపోయామని బన్నీ చెప్పాడు.