అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసి విజయాలను అందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజున తాను సినిమాకు దర్శకత్వం వహిస్తానని ముందుగానే చెప్పి, మరీ దర్శకురాలిగా మారారు బి.జయ. అసలే పురుషాధిక్య ప్రపంచంలో అందునా సినిమా రంగంలో ఎలా రాణిస్తావు? అని ఎందరో ఆమెను ప్రశ్నించిన వారున్నారు. వారందరికీ మెగాఫోన్ పట్టి సమాధానం చెప్పారామె. తెలుగు చిత్రసీమలో దర్శకత్వంలో రాణించే మహిళలు అరుదు. అలాంటి పరిస్థితుల్లో దర్శకురాలిగా తనదైన బాణీ పలికించి భళా అనిపించారు జయ. కలిదిండి…
‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాల ఘనవిజయంతో నందమూరి బాలకృష్ణ ‘నటసింహం’గా అభిమానులకు ఆనందం పంచారు. ఆ రెండు చిత్రాలు ‘ఇండస్ట్రీ హిట్స్’ గా నిలవడమే కాదు, అనేక రికార్డులు నెలకొల్పాయి. వాటిలో ‘సమరసింహారెడ్డి’కి కో-డైరెక్టర్ గా పనిచేసిన గొట్టిముక్కల రామ్ ప్రసాద్ తరువాత బాలకృష్ణ సినిమాతోనే దర్శకుడు కావాలని ఆశించారు. అయితే తొలుత ‘చిరునవ్వుతో’ సినిమాతో మెగాఫోన్ పట్టి, ఆ పై బాలకృష్ణ హీరోగా ‘సీమసింహం’ తెరకెక్కించారు రామ్ ప్రసాద్. 2002 జనవరి 11న ‘సీమసింహం’ జనం ముందు…
తెలుగు చలనచిత్రసీమలో మరపురాని చిత్రాలను అందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ తొలి చిత్రం ‘దొంగరాముడు’తోనే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించిన ‘అన్నపూర్ణ’ సంస్థ నిర్మించిన రెండవ సినిమా ‘తోడికోడళ్ళు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. అక్కినేనితో ఆదుర్తి తెరకెక్కించిన తొలి చిత్రమిదే. ఈ సినిమా ఘనవిజయం తరువాత ఏయన్నార్, ఆదుర్తి కాంబినేషన్ లో అనేక జనరంజక చిత్రాలు రూపొందాయి. 1957 జనవరి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావటం విశేషం. ప్రభాస్ తరహాలో ఏ భారతీయ హీరో ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు రెడీగా ఉంది. ఇక ‘సలార్’, ‘ఆదిపురుష్’ సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక అశ్వనీదత్ బ్యానరులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి కాకుండా ‘స్పిరిట్’ సినిమా కమిట్…
(జనవరి 10తో ‘అడవిలో అన్న’కు 25 ఏళ్ళు)ఎర్రజెండా సినిమాలకూ జనం జేజేలు పలుకుతున్న రోజుల్లో కొందరు స్టార్ హీరోస్ సైతం అటువైపు అడుగులు వేశారు. అలా మోహన్ బాబు నేను సైతం అంటూ విప్లవభావాలతో పాటు, ఆదర్శాలనూ పెనవేసి తెరకెక్కించిన చిత్రం ‘అడవిలో అన్న’. బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసి, నిర్మించిన చిత్రం ‘అడవిలో అన్న’. 1997 జనవరి 10న ఈ సినిమా విడుదలయింది. రెడ్ మార్క్ మూవీస్ కు అప్పట్లో తన బాణీలతో…
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు తప్పుకోవడంతో ‘బంగార్రాజు’కు అనుకోకుండా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ మూవీ ప్రీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాల నిడివితో రానుంది. ఈ…
‘ఆర్.ఆర్.ఆర్’ బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో చోటామోటా సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పది సినిమాలు అధికారికంగా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించాయి. వాటితో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా రానున్నాయి. వాటిలో అజిత్ నటించిన ‘వాలిమై’, విశాల్ ‘సామాన్యుడు’ కూడా ఉన్నాయి. ఇవి రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్స్ కావటమే ఏకైక ప్లస్ పాయింట్. నిజానికి అజిత్, విశాల్ కి తెలుగులో మార్కెట్ లేదు. విశాల్ కి ఒకప్పుడు ఉన్న…
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణలో టిక్కెట్ రేట్లు అధికంగా ఉన్న కారణంగా ఇకపై తెలంగాణలో తాను నిర్మించే సినిమాలను విడుదల చేయనని నట్టికుమార్ ప్రకటించాడు. ఏపీలో మూసివేసిన థియేటర్లను తెరుచుకునేలా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి నట్టికుమార్ ధన్యవాదాలు తెలిపాడు. జీవో నంబర్ 35ను రద్దు చేయాలంటూ వైజాగ్ ఎగ్జిబిటర్లు ఎవరూ న్యాయస్థానానికి వెళ్లలేదని.. 224 మందికి తెలియకుండా కొంతమంది కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేశారని నట్టికుమార్ ఆరోపించాడు. Read Also: మహేష్…
ఇంకా నాగ చైతన్య సమంత మధ్య ఆ లింకేంటి RRR టార్గెట్ మామూలుగా లేదుగా రివర్స్ రిజల్ట్‌తో ఓటిటికి షాక్ ఇచ్చిన పుష్ప అక్కడ చరణ్, తారక్ పరిస్థితేంటి ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్
హిందీ ‘జెర్సీ’ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. తాజాగా ఈ మూవీకి ఒమిక్రాన్ కేసుల సెగ తగలడంతో ఈనెల 31న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడినట్లు నిర్మాతలు ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని నటించిన తెలుగు మూవీ ‘జెర్సీ’ని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. తెలుగు మూవీకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ మూవీని కూడా తెరకెక్కించాడు. Read Also:…