కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను…
ఈ సారి జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్యంగా విల్ స్మిత్, వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై చేయిచేసుకోవడం పెద్ద దుమారం రేపింది. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ బోడిగుండుపై రాక్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన స్మిత్ అతనిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అకాడమీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల సమావేశమయింది. ఆ కమిటీ నిర్ణయం రాకమునుపే విల్ స్మిత్ తాను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. దానిని అకాడమీ సైతం…
అజయ్ దేవగన్‌ను బాలీవుడ్‌లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్‌లో పాపులర్. అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అజయ్ దేవగన్.. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో వెంకట రామరాజు పాత్రలో…
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రేపు ఉగాది రోజున గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా, పండుగ సందర్భంగా సినిమా ప్రీ-లుక్ కూడా విడుదల కాబోతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇందులో మరో నటి కనిపించనుంది. ప్రముఖ మోడల్ గాయత్రీ…
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం’కెజిఎఫ్’. 1970ల్లో కోలార్ మైన్ గోల్డ్స్ లో పనిచేసిన కార్మికుల జీవితాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాంకపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా 2018 డిసెంబర్ 20న పాన్ ఇండియా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కెజిఎఫ్2’ ఈ…
ఈ తరం వారికి దర్శకుడు శరత్ అంతగా తెలియకపోవచ్చు. కానీ శరత్ తెరకెక్కించిన సూపర్ హిట్స్ పేరు వింటే ఆయనా ఈ సినిమాలకు దర్శకుడు అని ఆశ్చర్యపోతారు. బాలకృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొక్కడు వంటి సూపర్ హిట్స్ తీశారు. సుమన్‌తో బావ-బావమరిది, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు వంటి విజయవంతమైన సినిమాలు రూపొందించారు. మహానటుడు ఏఎన్నార్ తో కాలేజీ బుల్లోడు, నటశేఖర కృష్ణతో సూపర్ మొగుడు లాంటి చిత్రాలు తీశారు. శరత్ మరణవార్త ఆయనతో పనిచేసిన వారికి దిగ్భ్రాంతి కలిగించింది.…
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్‌తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య,…
టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయన దర్శకత్వంలో నటించాలని అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిలింకు దర్శకత్వం వహించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు.…
ప్రియమణి, సన్నీలియోన్ తమ స్కేరీ లుక్స్‌తో భయపెడుతున్నారు. వివేక్ కుమార్ కన్నన్ తీస్తున్న ‘కొటేషన్ గ్యాంగ్’ మూవీలో ప్రియమణి, సన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌లో వారిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సారా అర్జున్ లుక్స్ కూడా రక్తపు మరకలతో భయానకంగా ఉండటం విశేషం. ఇందులో ప్రియమణి శకుంతలగా, సన్నీలియోన్ పద్మగా, జాకీ ష్రాఫ్ ముస్తఫాగా, సారా ఇరాగా కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ…
భీమ్లానాయక్ సినిమా తర్వాత రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉగాది పండగ తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని రంగంలోకి దిగనున్నారు. వరుస సినిమాలతో ఆయన బిజీగా గడపనున్నారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు పలు కొత్త సినిమాల షూటింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్లో పవన్ పాల్గొననున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల ఆర్ట్ డైరెక్టర్…