ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై మంచి హిట్ సాధించడం, పుష్ప-2 సినిమాకు కాస్త టైం దొరకడంతో ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే బన్నీ ఒకవైపు సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ ఇప్పటికీ అంతే ప్రేమగా ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్నాడు. 2011 మార్చి 6వ తేదీన అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నేటికి వీరి వివాహం…
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత డైరెక్టర్ శంకర్‌తో రామ్‌చరణ్ ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా అతడికి సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన ఈ బాహుబలి కాజాను చెర్రీకి బహూకరించింది. కాగా రాజమండ్రి వచ్చే…
ఇండియన్ ఐడిల్ కార్యక్రమంలో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగానే గాయనీ గాయకులు పోటీ పడినట్టు ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే మార్చి 4, 5 తేదీలలో స్ట్రీమింగ్ అయిన 3వ ఎపిసోడ్ చూస్తే… కామెడీ ఎక్కువ కంటెంట్ తక్కువ అనే భావనే వీక్షకులకు కలిగింది. ఆహా నుండి వస్తున్న ఈ కార్యక్రమంలో గానం కంటే వినోదానికి పెద్ద పీట వేస్తున్నారేమో అనిపిస్తోంది. పైగా కంటెస్టెంట్స్ అందిస్తున్న వినోదం, మిఠాయిలు… న్యాయనిర్ణేతలను శాటిస్ ఫై చేస్తుండొచ్చు…
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా గ్లిమ్స్‌ను అతని బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఒరిజినల్స్ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ పోస్టర్‌ను గౌతమ్ క్యారెక్టర్‌లోని పెయిన్‌ను తెలియచేసే విధంగా చిత్ర యూనిట్ డిజైన్ చేసింది. నటుడిగా ‘మను’తో సర్ ప్రైజ్ చేసిన గౌతమ్ ఈసారి…
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే తాను చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్ మీద బేస్ చేసి తీసిన…
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘విరాటపర్వం’. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహించారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, నందితాదాస్, బెనర్జీ, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం -2’, ‘నారప్ప’ చిత్రాలు ఓటీటీలో విడుదలైన నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ పై నిర్మితమైన ‘విరాటపర్వం’ సైతం ఓటీటీలోనే వస్తుందనే…
నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం…
సుప్రసిద్ధ నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి చలన చిత్రం సంస్థ నుండి ఓ యువ కథానాయకుడిని పరిచయం చేయబోతున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటిని సాయి కొర్రపాటి హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో గ్రాండ్ గా జరుగబోతోంది. కన్నడ చిత్రం ‘మాయాబజార్’ను తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్టర్.…
హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే ఛాన్స్ దొరికితే విలన్ గా తన సత్తా చాటుతున్నాడు ఆది పినిశెట్టి. అంతేకాదు… ఇతర హీరోల చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడానికీ వెనకాడటం లేదు. అలా ‘రంగస్థలం’, ‘నిన్ను కోరి’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలలో నటించాడు. అయితే ‘సరైనోడు’లో ముఖ్యమంత్రి తనయుడు వైరం ధనుష్ గా ఆది పినిశెట్టి పోషించిన పాత్రను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు తాను ఉస్తాద్ రామ్ తో తీస్తున్న…
బిగ్ బాస్ 5 ఫేమ్ మానస్ కొత్త వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే పలు చిత్రాలలో, సీరియళ్లలో నటించి చక్కని గుర్తింపు పొందిన మానస్ తొలిసారి ఓటీటీ కోసం ఈ వెబ్ సీరిస్ లో నటిస్తున్నాడు. అతని సరసన ‘రాజన్న’ ఫేమ్ యానీ నాయికగా నటించబోతోంది. విశేషం ఏమంటే మానస్ లానే యానీ సైతం బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఆమె ‘లూజర్’ వెబ్ సీరిస్ లో కీలక పాత్రను…