టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయన దర్శకత్వంలో నటించాలని అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిలింకు దర్శకత్వం వహించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిలిం కోసం ఆయన దర్శకత్వంలో షూటింగ్‌ను తాను చాలా ఎంజాయ్ చేశాను. ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో విడుదలై రంగస్థలం సినిమా ఇటీవలే నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించాడు. సమంత హీరోయిన్‌గా నటించింది.
దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా enjoy చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు. pic.twitter.com/3iZmcyLmvy
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2022