ప్రియమణి, సన్నీలియోన్ తమ స్కేరీ లుక్స్‌తో భయపెడుతున్నారు. వివేక్ కుమార్ కన్నన్ తీస్తున్న ‘కొటేషన్ గ్యాంగ్’ మూవీలో ప్రియమణి, సన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌లో వారిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సారా అర్జున్ లుక్స్ కూడా రక్తపు మరకలతో భయానకంగా ఉండటం విశేషం. ఇందులో ప్రియమణి శకుంతలగా, సన్నీలియోన్ పద్మగా, జాకీ ష్రాఫ్ ముస్తఫాగా, సారా ఇరాగా కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాలో ప్రియమణి కాంట్రాక్ట్ కిల్లర్‌గా కనిపించనుందట. రూ.500 కోసం నాటు తుపాకీతో మర్డర్‌లు చేసే ముఠా కథ ఇది. కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు వివేక్ కుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ థ్రిల్లర్ డ్రామాను త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.