Ajay Devagan Birthday: ధనా ధన్… అజయ్ దేవగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజయ్ దేవగన్‌ను బాలీవుడ్‌లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్‌లో పాపులర్. అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అజయ్ దేవగన్.. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో వెంకట రామరాజు పాత్రలో కనిపించి మురిపించారు.
అజయ్ దేవగన్ 1969 ఏప్రిల్ 2న ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి వీరూ దవగన్ హిందీ చిత్రసీమలో పేరు మోసిన ఫైట్ మాస్టర్. అజయ్ అసలు పేరు విశాల్ వీరూ దేవగన్. చిన్నతనం నుంచీ తండ్రితో పాటు షూటింగ్స్ చూడడం వల్ల అజయ్ మనసు సహజంగానే సినిమా ఆకర్షణకు గురయింది. తండ్రి పర్యవేక్షణలో తన శరీరాన్ని తీర్చిదిద్దుకున్న అజయ్ దేవగన్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’లోనే హీరోగా మార్కులు సంపాదించారు. అప్పటి నుంచీ పలు యాక్షన్ డ్రామాస్ లో నటించి ఆకట్టుకున్నారు అజయ్. అతను స్టార్ గా సాగుతున్న సమయంలోనే బాలీవుడ్ లో సూపర్ హీరోయిన్ అనిపించుకుంటోంది కరిష్మా కపూర్. ఆమెతో కొంతకాలం ప్రేమాయణం సాగించారు అజయ్. ఆ తరువాత ఇద్దరూ ఎందుకనో విడిపోయారు. తరువాత తనతో ‘గుండారాజ్’లో కలసి నటించిన కాజోల్ తో ప్రేమలో పడ్డారు అజయ్. అదే సమయంలో కాజోల్ సైతం బాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంటోంది. షారుఖ్ ఖాన్ హిట్ పెయిర్ గా కాజోల్ నిలిచారు. అజయ్, కాజోల్ ప్రేమను ఇరు వైపులవారు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే పెళ్ళాడిన అజయ్-కాజోల్ దంపతులకు ఇద్దరు పిల్లలు.
Also Read
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
అనేక యాక్షన్ మూవీస్ లో మెప్పించిన అజయ్, విలక్షణమైన పాత్రలు లభిస్తే మాత్రం వదిలేవారు కాదు. ఆ రీతిన 1998లో మహేశ్ భట్ తెరకెక్కించిన ‘జక్మ్’, 2002లో రాజ్ కుమార్ సంతోషి రూపొందించిన ‘ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు అజయ్ దేవగన్. తన తండ్రిలాగే పేరు మోసిన యాక్షన్ మాస్టర్ శెట్టి తనయుడైన రోహిత్ శెట్టితో అజయ్ అనుబంధం ప్రత్యేకమైనది. రోహిత్ దర్శకుడు కావడానికి అజయ్ ఎంతగానో సహకరించారు. రోహిత్ తొలి చిత్రం ‘జమీన్’ మొదలు ‘బోల్ బచ్చన్’ దాకా వరుసగా ఎనిమిది సినిమాల్లో అజయ్ నటించారు. “సింగమ్” సిరీస్ లోనూ, “గోల్ మాల్” ఫ్రాంచైజ్ లోనూ అజయ్ దేవగన్ తోనే రోహిత్ శెట్టి సాగారు. మన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’లోనూ అజయ్ దేవగన్ హీరోగా అభినయించారు. నవరసాలు పోషించి మెప్పించాలన్నదే అజయ్ లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే అజయ్ తనదైన పంథాలో పయనిస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ‘రన్ వే 34’లో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కాక ‘మైదాన్, సర్కస్, థ్యాంక్ గాడ్, భోలా, దృశ్యం-2’ చిత్రాల్లోనూ అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ చిత్రాలతోనూ అజయ్ తన అభిమానులను అలరిస్తారని చెప్పవచ్చు.
(ఏప్రిల్ 2న అజయ్ దేవగన్ పుట్టినరోజు)
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!