Allu Arjun Multiplex: మొన్న మహేష్ బాబుతో కలసి ఏఎంబీ సినిమాస్, నిన్న విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్‌ను ఆరంభించిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ అల్లు అర్జున్‌తో కూడా చేతులు కలిపిన విషయం తెలిసిందే. నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ దిగ్గజంగా పేరున్న ఏషియన్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలంగాణలో మెజారిటీ థియేటర్లను కలిగిఉంది. ఏషియన్ గ్రూప్ ఇప్పటికే పలు మల్టీప్లెక్స్‌తో పాటు అనేక సింగిల్ స్క్రీన్‌లను సొంతంగా నిర్మించటమో లేక లీజ్ కు తీసుకుని ఉండటమో చేస్తోంది.…
ఐ క్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దోచేవారేవారురా!'. ఈ సినిమా నుంచి తాజాగా 'కల్లాసు అన్ని వర్రీసూ... నువ్వేలే.. నీ బాసూ..' పాటను గుంటూరు మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు చేతులు మీదుగా విడుదల చేసారు.
ఏఆర్ మురుగదాస్ పేరు వినగానే తను దర్శకత్వం వహించిన 'గజనీ', 'స్టాలిన్', 'తుపాకి', 'సర్కార్' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగులో తను డైరెక్ట్ చేసింది ఒకే ఒక సినిమా అయినా తను దర్శకత్వం వహించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవటమే, డబ్ అవటమే జరిగాయి.
Mahesh Fans on Fire: మహేష్ బాబు అభిమానులు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ఫైర్ అవుతున్నారు. విజయ్ సినిమా ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’)లో రెండో సింగిల్ సాంగ్ విడుదల అందుకు కారణం అయింది. 2019లో మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్ అయి జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే అది తమ అభిమాన హీరో కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా కావటంలో టైటిల్స్‌లో స్పెషల్ ప్రజెంటేషన్ ఉంటుందని భావించారు.…
Bigg Boss 6: బిగ్‌బాస్-6 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం ఫినాలే వీక్ జరగబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా, కీర్తి, శ్రీసత్య 13వ వారం కొనసాగుతున్నారు. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ ఏడుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం మంచి టీఆర్పీ…
Hyper Aadi: జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు అదిరిపోయే సెటైర్లతో అతడు హంగామా చేస్తుంటాడు. ప్రతి స్కిట్‌లో కూడా కావాలనే లవ్, మ్యారేజ్ లాంటి అంశాలను జొప్పిస్తుంటాడు. హైపర్ ఆది వేసే పంచులు, కామెడీ టైమింగ్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బుల్లితెర ఆడియన్స్ అతడిని బాగా ఇష్టపడతారు. హైపర్ ఆది ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని ఎలాంటి సమాచారం కూడా లేదు.…
Stunt Master: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తమిళ సినిమా ‘విడుదలై’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై శివారులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్‌లో భాగంగా తాడుకు వేలాడుతున్న స్టంట్ మాస్టర్ సురేష్ తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో చోటు చేసుకుంది. Read Also: Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో…
Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్న ఆయన హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపేశారు. సాహో ఫేం దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. తొలుత ఈ కాంబినేషన్ పుకారు అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ సినిమాపై ఆర్.ఆర్.ఆర్ సినిమా…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పటికి 24 సార్లు బాక్సాఫీస్ వద్ద ఢీ కొన్నారు. అందులో ఎనిమిది సార్లు సంక్రాంతి బరిలోనే పోటీ పడడం విశేషం! అంటే ఈ సారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తొమ్మిదో సారి పొంగల్ హంగామాలో పాలు పంచుకుంటున్నారన్నమాట!
OTT Updates: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో విజయవంతమైన ప్యార్ ప్రేమ కాదల్ సినిమ ఆధారంగా ఊర్వశివో రాక్షసివో సినిమాను తెరకెక్కించారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో అల్లు శిరీష్ ప్రేక్షకుల…