Chiranjeevi vs Balakrishna: మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పటికి 24 సార్లు బాక్సాఫీస్ వద్ద ఢీ కొన్నారు. అందులో ఎనిమిది సార్లు సంక్రాంతి బరిలోనే పోటీ పడడం విశేషం! అంటే ఈ సారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తొమ్మిదో సారి పొంగల్ హంగామాలో పాలు పంచుకుంటున్నారన్నమాట! అసలు ‘నంబర్ నైన్’ ఈ ఇద్దరు హీరోల పోటీలో ఎలా ప్రముఖ పాత్ర పోషించిందో గుర్తు చేసుకుందాం.
Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!
చిరంజీవి, బాలకృష్ణ తొలిసారి 1984 సెప్టెంబర్ లో బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగారు. సెప్టెంబర్ – అంటే తొమ్మిదో నెల. ఆ నెల 7వ తేదీన బాలకృష్ణ ‘మంగమ్మగారి మనవడు’ విడుదల కాగా, 14న చిరంజీవి ‘ఇంటిగుట్టు’ జనం ముందు నిలచింది. తొలి ఫైట్ లో బాలయ్యది పైచేయిగా సాగింది. ఇక తొలిసారి పొంగల్ బరిలో చిరంజీవి, బాలయ్య 1987లో ఢీ కొన్నారు. ఆ యేడాది చిరంజీవి ‘దొంగమొగుడు’గా జనం ముందుకు రాగా, బాలయ్య ‘భార్గవరాముడు’గా వచ్చారు. ‘దొంగమొగుడు’ 1987 జనవరి 9న విడుదలయింది. ఇక్కడ తేదీ తొమ్మిది. అప్పుడు చిరుది పైచేయి అయింది. ఇక సంవత్సరం సంఖ్యలో తొమ్మిది విషయానికి వస్తే – 1998 మొత్తాన్ని కూడితే 9 వస్తుంది. ఆ యేడాది చిరంజీవి ‘బావగారూ బాగున్నారా?’ ఏప్రిల్ 9న విడుదల కాగా, బాలయ్య ‘యువరత్న రాణా’ ఏప్రిల్ 17న వచ్చింది. అప్పుడు కూడా చిరుదే పైచేయి. తేదీ, నెల, సంవత్సరం – ఇలా మూడు ఫార్మాట్స్ లోనూ నంబర్ 9 కీ రోల్ ప్లే చేసింది. ఇక రెండు తొమ్మిదిలు ఉన్న 99లో జనవరిలో చిరంజీవి 1వ తేదీ ‘స్నేహం కోసం’తో వస్తే, బాలయ్య అదే నెల 13న ‘సమరసింహారెడ్డి’గా వచ్చారు. అప్పుడు బాలయ్యది పైచేయి. మరి ఈ సారి ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో తొమ్మిదోసారి పోటీ పడుతున్నారు. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా గర్జిస్తూండగా, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా విజృంభిస్తానంటున్నారు. మరి ఈ సారి ‘9’ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలుస్తుందో చూడాలి.