Stunt Master: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తమిళ సినిమా ‘విడుదలై’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. చెన్నై శివారులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. షూటింగ్‌లో భాగంగా తాడుకు వేలాడుతున్న స్టంట్ మాస్టర్ సురేష్ తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో చోటు చేసుకుంది.
Read Also: Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో పవన్.. డీవీవీ నుంచి ప్రకటన వచ్చేసింది
ప్రముఖ తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్, హీరో సూరి కాంబినేషన్ లోతెరకెక్కుతున్న ‘విడుదలై’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టంట్ మాస్టర్ సురేష్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి మృతి చెందాడు. స్టంట్ మాస్టర్ మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నాడు. చెన్నై శివారులోని వండలూరు సమీపంలోని ఉనమంచెరిలో సన్నివేశం కోసం రైలు పట్టాల సెట్‌ను నిర్మించారు. అందులో రైలు ప్రమాదానికి గురయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా సురేష్‌తో సహా కొంతమంది నటులను భారీ క్రేన్‌కు బిగించి తాళ్లతో కట్టివేశారు. అయితే తాళ్లు తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది.