Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో పవన్.. డీవీవీ నుంచి ప్రకటన వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్న ఆయన హరీష్ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపేశారు. సాహో ఫేం దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నారు. తొలుత ఈ కాంబినేషన్ పుకారు అని పవన్ అభిమానులు భావించారు. కానీ ఈ సినిమాపై ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక ప్రకటన చేసింది.
Read Also: Text Message: ‘SMS’ @ 30 ఏళ్లు.. తొలి మెసేజ్ ఏంటో తెలుసా?
Also Read
ఈరోజు ఉదయం 8 గంటల 55 నిమిషాలకు ఈ సినిమా గురించి డీవీవీ బ్యానర్ ట్వీట్ చేసింది. దీంతో సుజిత్-పవన్ కాంబో సినిమా నిజమే అని స్పష్టమైంది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ‘they call him #OG’ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో పవన్ వెనుకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ మూవీకి రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ తెలియనున్నాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ విజయం తరువాత నిర్మాత డీవీవీ దానయ్య నుంచి వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!