Bigg Boss 6: బిగ్‌బాస్-6 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం ఫినాలే వీక్ జరగబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా, కీర్తి, శ్రీసత్య 13వ వారం కొనసాగుతున్నారు. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ ఏడుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈవారం ఫినాలె టిక్కెట్ సంపాదించిన శ్రీహాన్ మినహా మిగతా ఆరుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. దీంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంశం ఆసక్తి రేపుతోంది.
Read Also: Tamannaah: ఎట్టకేలకు పెళ్లి గురించి ఓపెన్ అయిన మిల్కీ బ్యూటీ
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వచ్చేవారం ఫినాలే వీక్ కాబట్టి టాప్-5 మాత్రమే హౌస్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రకారం శ్రీసత్య, కీర్తి ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. ఈ వారం రేవంత్ అత్యధిక ఓట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడే బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అటు ఇనయా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ మూడో స్థానంలో, ఆదిరెడ్డి నాలుగో స్థానంలో ఉన్నారు. ఫ్యామిలీ వీక్ తర్వాత రోహిత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో అతడు టాప్-3లో ఉంటాడని కూడా టాక్ నడుస్తోంది. చివరి రెండు స్థానాల్లో కీర్తి, శ్రీసత్య కొనసాగుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీళ్లిద్దరూ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని గాసిప్ రాయుళ్లు చెప్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే.