Web Series: నటిగా చిర పరిచితురాలైన అస్మిత యూట్యూబర్‌గా చేసిన ప్రయాణం సక్సెస్ స్టోరీగా మారింది. యాష్ ట్రిక్స్ పేరుతో అస్మిత చేసిన వీడియోలు ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. సీరియల్స్‌తో పాటు వెండితెర నటిగా సక్సెస్ ఫుల్ కెరియర్ లీడ్ చేస్తున్న టైమ్‌లో వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద సక్సెస్‌గా మారింది. యాష్ ట్రిక్స్ డిజిటల్ మీడియాలో బ్రాండ్ అయింది. అస్మిత మోటివేషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తనకు జీవిత భాగస్వామి సుధీర్ అందించిన సహాకారంతో యాష్ ట్రిక్స్‌ను బ్రాండ్‌గా మార్చాయి. అస్మిత ఇప్పడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మరో అడుగు ముందుకు వేసి A1 from Day1 వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ ప్రివ్యూకు యాష్ ట్రిక్స్ ఫ్యామిలీని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు.
Read Also: Raj Kahani: అమ్మ ప్రేమ… అమ్మాయి ప్రేమ నేపథ్యంలో చిత్రం!
ఈ సందర్భంగా అస్మిత మాట్లాడుతూ.. ‘నటిగా బిజీ గా ఉండి డిజిటల్ మీడియా వైపు అడుగులు వేసాను. ఆరంభంలో ఎవరు చూస్తారనే కామెంట్స్ విన్నాను. అయితే అప్పుడు ఎగతాళి చేసిన వారు తర్వాత డిజిటల్ మీడియావైపు రావటం ఆనందంగా ఉంది. పెళ్ళి, పిల్లలతో మహిళల కెరియర్ ఆగిపోతుందనే కాన్సెప్ట్ నమ్మను. ఆ నమ్మకంతో యాష్ ట్రిక్స్ మొదలు పెట్టాను. నిజాయితీగా ప్రయత్నిస్తూ నమ్మకాన్ని పొందాం. ఇప్పుడు యాష్ ట్రిక్స్ నుండి ఒక వెబ్ సిరీస్ విడుదల చేస్తున్నాం. సుధీర్, నేను భార్య భర్తలుగా నటించిన ఈ సిరీస్ లో ఆలీగారు ముఖ్య పాత్రను పోషించారు. 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనిని చూడటానికి రూ. 59.00 ధర పెట్టాం’ అన్నారు.
దర్శకుడు, నటుడు సుధీర్ మాట్లాడుతూ ‘యాష్ ట్రిక్స్ సక్సెస్ సుదీర్ఘమైన ప్రయాణం. చిన్న టీంతో మొదలైన మా ప్రయత్నం బ్రాండ్‌గా మారడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు A1 from Day1 వెబ్ సిరీస్ మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు అవకాశాల కోసం ప్రయత్నించడం కంటే వాటిని సృష్టించుకోవడం మేలు అని గ్రహించాం. అందుకే కంటెంట్ మీద నమ్మకంతో పే ఫర్ వ్యూ కేటగిరీలో వెబ్ సిరీస్ ని ఉంచాం. భార్య భర్తల మద్య ఉండే అల్లరి అలకలను అందంగా చిత్రీకరించాం. డిసెంబర్ 10 సాయంత్రం 5:30 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రివ్యూ కి వచ్చిన స్పందన నమ్మకాన్ని ఇచ్చింది’ అని అంటున్నారు. మరి అస్మిత, సుధీర్ నమ్మకం ఏ మేరకు నిజం అవుతుందో చూద్దాం.