మహాత్మా గాంధీపై నటుగు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కి బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ లో నటుడు శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని, అతడి అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందించారు. Also Read…
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సహకారంతో ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB), మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , మరియు సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించబడింది. Also Read:Konda Vishweshwar Reddy: నేను బీఆర్ఎస్…
Karate Kalyani : నిత్యం ఏదో ఒక వివాదం వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తారు కరాటే కళ్యాణి. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బ్యాండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతుండగా నటి కరాటే కళ్యాణి అభ్యంతరం చెప్పారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించినట్టు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఆ పదకొండు మందిని రాజీనామా ఉపసంహరించుకోమని కోరానని, నెల రోజులు గడిచినా వారు మనసు మార్కుకోకపోవడంతో, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కాకుండా ఉండాలని వేరే వారితో ఆ పదవులను భర్తీ చేశామని విష్ణు చెప్పారు. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్ తో సహా పదవులకు రాజీనామా చేసిన వారంతా ‘మా’…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మళ్లీ రచ్చ మొదలైంది. మా ఎన్నికలు జరిగి నెలరోజులు దాటినా.. కొత్త ప్యానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం లేదని కొందరు నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరగలేని ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్గం నటీనటులు ఆరోపిస్తున్నారు. మా కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా మూసిఉంటోందని.. దాంతో తాము నిరాశగా వెనుతిరగాల్సి…
‘మా’ ఎన్నికల వివాదం ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలతో మరో కీలక మలుపు తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని, ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీషీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అతనిపై రౌడీ షీట్ తో పాటు హత్య కేసు కూడా ఉందని, ముగ్గురు ఎస్ఐలను కొట్టాడని ఆరోపించారు ప్రకాష్ రాజ్. ఈ నెల 14వ తేదీన ఈ విషయంపై ఎన్నికల…
‘మా’ ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘మా’లో మొదటి నుంచీ మాటల యుద్ధాలు, తూటాలు పేలుతూ వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత అంతా చల్లబడుతుందని భావించారు. కానీ ఈ వివాదం సద్దుమణగడం మాట అటుంచి, రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. ఇప్పటికే ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు బృందం ప్రమాణ స్వీకారం చేసి ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మంచు విష్ణు ప్యానల్ గెలిచిందని ప్రకటించిన మరుసటి రోజే రాజీనామాల పర్వం మొదలైంది.…
‘మా’ ఎన్నికల వివాదంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఎన్నికల సమయంలో తమపై దౌర్జన్యం చేశారని, దాడి చేశారని ఆరోపిస్తూ ‘మా’ ఎన్నికలపై కోర్టుకు వెళ్తామని, అయితే అంతకన్నా ముందు సీసీటీవీ ఫుటేజ్ చూస్తామని కోరుతూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. అయితే కృష్ణమోహన్ మాత్రం దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని ఎవరు పడితే వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ చూపించలేమని అన్నట్లు ప్రకాష్ రాజ్…
శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికలు ముగిసిన దృష్ట్యా ఇక పై తాను, తన కమిటీ సభ్యులు ఎవరూ మీడియా ముందుకు రాబోమని ప్రకటించారు. ఓ యేడాదితో తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని, ముగిసిన ఎన్నికల గురించి మాత్రం పెదవి విప్పమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తాను గెలవాలని కొందరు పూజలు చేశారని, వాటిని…
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలే అని చెప్పక తప్పదు. ఓ వైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి. ఎమ్మెల్లే ఎన్నికల తరహాలో జరిగిన ఈ ఎలక్షన్లలో మంచు విష్ణు ప్యానెల్ లో మెజారిటీ సభ్యలు విజయం సాధించారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యలు ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను, మోహన్ బాబు దూషణ…