నిన్న ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ‘మా’ సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, కానీ తనకు ఆత్మ గౌరవం ఉందని, ఇకపై మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండబోనని, ఇది నొప్పితో తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. తన నిర్ణయానికి…
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన తన ఓటమికి కారణం చెబుతూ ‘మా’ సభ్యుడిగా రాజీనామా చేశారు. ఇందులోకి జాతీయవాదం కూడా వచ్చింది. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి నేతలు ట్వీట్ చేసి జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్లకు కంగ్రాజులేషన్స్ చెప్పారు అని అన్నారు. రచయితలతో, దర్శకనిర్మాతలతో, నటీనటులతో తన అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ప్రాంతీయత…
మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ ఎన్నికల ఓటింగ్ ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు పూర్తయ్యింది. అనుభవజ్ఞుల సమక్షంలో కౌంటింగ్ ను సా. 5.00 గంటలకు మొదలు పెట్టారు. గతంలో మాదిరి కాకుండా ఫలితాలు త్వరగానే వస్తాయని అంతా భావించారు. అయినా రాత్రి 10.30 వరకూ వాటిని అధికారికంగా తెలియచేయలేదు. ముందుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలో విజేతలను ప్రకటిస్తారని, ఆ తర్వాతే ఆఫీస్ బేరర్స్ ఫలితాలు వెల్లడిస్తారని ముందు నుండి చెబుతూ వచ్చారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆఫీస్…
మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ నిన్న హైదరాబాద్ ఉత్కంఠభరితంగా జరిగాయి. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అక్టోబర్ 10 ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగగా, సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రాత్రి 9 గంటల వరకూ జరిగిన కౌంటింగ్ లో మంచు విష్ణు విజేతగా నిలిచారు. ఇక ఈ సందర్భంగా చిరంజీవి,…
నిన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాతో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు స్పందిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి ముందుకు వెళదాం ముందు పాజిటివ్ కామెంట్స్ చేశారు. Read Also : నాగబాబు శల్య సారధ్యం చేశారా!? “అందరికీ నమస్కారం. ఒకరి విజయం కాదు. సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్ళే.…
నూతన ‘మా’ అధ్యక్షుడికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 10న ఉదయం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు కొనసాగిన పోలింగ్ కేంద్రం వద్ద హైడ్రామా నడిచింది. ఇరు ప్యానల్ ల సభ్యులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పోలింగ్ కేంద్రంలోనూ అసభ్యకర భాషలో…
“మా” మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. నిన్న జరిగిన ‘మా’ అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. ఇరు ప్యానళ్ల మధ్య హోరాహోరి జరిగిన పోటీలో ఎట్టకేలకు మంచు విష్ణు విజయపతాకం ఎగరేసి ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే విష్ణు ప్యానల్ భారీ మెజార్టీ ఓట్లతో గెలవడానికి ముఖ్యకారణం ప్రాంతీయవాదం అని చెప్పొచ్చు. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు లోకల్, నాన్ లోకల్ అనే ప్రాంతీయ…
క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ రణరంగాన్ని తలపించిన ‘మా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఇంతకు మునుపెన్నడూ జరగని విధంగా ఈసారి చాలామంది ‘మా’ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ‘మా’ సభ్యులు 925 మంది ఉండగా, రికార్డు స్థాయిలో అంటే పోస్టల్ బ్యాలెట్ తో కలిఫై మొత్తం 665 మంది సభ్యులు ఓటు వేశారు. దాదాపు 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 83 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గతంతో పోలిస్తే భారీగా…
‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Read also : మీడియాకి మంచి మెటీరియల్…
‘మా’ ఎన్నికలు ఉద్రిక్తతలు, తోపులాటలు, ఆరోపణలను మధ్య జరుగుతున్నాయి. సినీ స్టార్స్ ఒక్కొక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ 300లకు పైగా ఓట్లు నమోదు అయ్యాయి. మరో రెండున్నర గంటల్లో ఓటింగ్ పూర్తి కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రికి ఫలితాలు వెల్లడవ్వనున్నాయి. నేటితో ఈ ‘మా’ గొడవలకు, ఘర్షణలకు, ఆరోపణలకు, ప్రత్యారోపణలకు తెర పడనుంది. గెలిచినవారి ఇప్పటికే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు ? అనే…