ED Raids: టార్గెట్ మహా సర్కార్..? ఈడీ రైడ్స్ కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్… నిన్న మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది. ఠాక్రే బావమరిది శ్రీధర్మాధవ్పటాంకర్ పేరుతో ఉన్న శ్రీసాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ 6.45 కోట్లు.
Read Also: Paddy Procurement: హస్తినలో తెలంగాణ మంత్రుల టీమ్.. కేంద్ర మంత్రులతో భేటీలు..
Also Read
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
పుష్పక్ గ్రూప్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా… శ్రీసాయిబాబా గృహనిర్మితికి నగదును బదిలీ చేసినట్లు సమాచారం వచ్చిందని ఈడీ వెల్లడించింది. పుష్పక్గ్రూప్కేసు నిందితుడు మహేష్ పటేల్, మరో నిందితుడు నందకిశోర్చతుర్వేది సాయంతో శ్రీధర్మాధవ్సంస్థలోకి నగదును బదిలీ చేసినట్లు తెలిపింది. దాదాపు 50 కోట్లను శ్రీధర్ మాధవ్ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది. శ్రీధర్ మాధవ్ ఆస్తులను ఈడీ అటాచ్చేయడంపై సంజయ్‌రౌత్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఈడీ చర్యలు చేపడుతోందన్నారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను మూసేసినట్టు ఉందని కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!