లోక్‌సభ ఎన్నికల ఫలితాలు , ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. గురువారం గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త శిబిరానికి భగవత్ హాజరయ్యారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు సీఎం యోగి, మోహన్ భగవత్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
Mohan Bhagwat: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన స్వయం సేవక్ అహంకారాన్ని ప్రదర్శించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మర్యాదగా కొనసాగడం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు.
Mohan Bhagwat: దేశ ప్రజల్లో మన గుర్తింపు గురించి అవగాహన కొరవడిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అనే పుస్తక
ప్రపంచం మొత్తానికి భారతదేశం అవసరం ఉంది.. దానికి అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే ఈ ప్రపంచం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
RSS: ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేవారు. ముస్లింలు, ఇతర మతాలకు చెందిన వ్యక్తులు అన్ని వివాదాస్పద మత స్థలాలను స్వచ్ఛందంగా హిందూ సమాజానికి అప్పగించాలని కోరారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గోహత్యపై పెద్ద ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆవును వధించడానికి కసాయిని పంపేది హిందువులే అని అన్నారు.
గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 'స్వయం సమృద్ధి భారతదేశం' అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచానికి లౌకికవాదాన్ని బోధించాల్సిన అవసరం లేదని అన్నారు.
మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. మణిపూర్‌లో కుట్రపూరితంగానే ఈ ఘటన అంతా జరిగిందన్నారు. నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్రస్తావించారు.
పూణేలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ మీటింగ్ 2023 జరుగుతోంది. ఈ సమావేశానికి 36 సంస్థలకు చెందిన 266 మంది ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పర్యావరణ అనుకూల జీవనశైలి, జీవన విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ, సామరస్యానికి పట్టుబట్టడం, స్వదేశీ ప్రవర్తన, పౌర విధులను నెరవేర్చడం వంటి ఐదు అంశాలపై చర్చించనున్నారు.