Mohan Bhagwat: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన స్వయం సేవక్ అహంకారాన్ని ప్రదర్శించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మర్యాదగా కొనసాగడం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. బీజేపీ జాతీయవాదంపై దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ, 10 ఏళ్లలో మొదటిసారిగా మెజారిటీ మార్క్ 272కి తక్కువగా సీట్లు పడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టీడీపీ, జేడీయూ నితీష్ కుమార్‌లపై ఆధాపడింది. బీజేపీకి సొంతగా 240 సీట్లు ఉన్నాయి.
Read Also: Vishnupriya Hot Pics: ఏమా అందాలు.. వర్షాకాలంలో వేడి పుట్టిస్తున్న విష్ణు ప్రియ!
నాగ్‌పూర్‌లో జరిగిన సంఘ్ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. రాజకీయ పార్టీలు, నేతలు ఒకరినొకరు దూషించుకునే క్రమంలో వర్గాల మధ్య చీలికలకు కారణమవుతున్నామనే విషయాన్ని పరిగణలోకి తసీుకోలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్‌ని కూడా ఇందులోకి లాగుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇతరులను దుర్వినియోగం చేయడం, టెక్నాలజీని దుర్వినియోగం చేయడం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదన్నారు. మణిపూర్ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రాధాన్యతగా నొక్కిచెప్పారు.
మణిపూర్ శాంతి కోసం ఎదురుచూసి ఏడాది అయింది. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం శాంతియుతంగా ఉంది, కానీ అకస్మాత్తుగా, మళ్ళీ తుపాకీ సంస్కృతి పెరిగింది. వివాదాన్ని ప్రాధాన్యతగా పరిష్కరించడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. మణిపూర్ పరిస్థితిని ప్రాధాన్యతతో పరిష్కరించాలి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టాలని కోరారు. మణిపూర్ గత ఏడాది మే 3న ఇంఫాల్ లోయకు చెందిన మెయిటీస్ మరియు కొండ ఆధారిత కుకీల మధ్య వివాదం చెలరేగిన తర్వాత జాతి హింసకి కారణమైంది.ఫలితంగా 200 మందికి పైగా మరణించారు మరియు వేలాది మంది నిరాశ్రయులయ్యారు.