సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ 10 రోజుల బెంగాల్లో పర్యటిస్తున్నారు. నేడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ తదుపరి కార్యాచరణపై ఆయన వివరణ ఇచ్చారు.
V.Hanumantha Rao : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న…
V. Hanumantha Rao : బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వక్రికరించే పనిలో ఉందని, మోడీ సర్కార్ రిమోట్ కంట్రోల్ మోహన్ భగవత్ దగ్గర ఉందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య కట్టిన రోజే స్వాతంత్య్రం వచ్చింది అని అనడం సరికాదని, భగత్ సింగ్ లాంటి వాళ్ళ త్యాగాన్ని అవమానించినట్టు అని ఆయన మండిపడ్డారు. మోడీ.. సమాధానం చెప్పాలని, అమిత్ షా…అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు…
ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భగవత్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం.. అయితే, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ దేశ ప్రజలందరినీ అవమానించారు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అనేక శతాబ్దాలుగా శత్రువుల దాడిని ఎదుర్కొన్న భారతదేశానికి "నిజమైన స్వాతంత్ర్యం" మాత్రం అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన తర్వాతే వచ్చిందన్నారు.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.
Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, దౌర్జన్యాలన్నీ మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో మహానుభావ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. మత ప్రాముఖ్యతను అభివర్ణిస్తూ.. దానికి సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మతం ఎప్పటి నుంచో ఉందని, దాని ప్రకారమే అన్నీ పని చేస్తాయన్నారు. అందుకే దానిని "సనాతనం" అంటారన్నారు. మతం గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం…
ప్రస్తుత కాలంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.