RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సునీల్ అంబేకర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ జనాభా పెరుగుదల రేటు (ఫెర్టిలిటీ రేటు) క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని డెమోగ్రఫీ నిబంధనలు చెబుతున్నాయన్నారు.
Mohan Bhagwat : హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ఆదివారం లోక్ మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఏకత అనేది శాశ్వతం.. భిన్నత్వం లో కూడా ఏకత్వం ఉందన్నారు. వాళ్ళ గ్రౌండ్ లోకి వెళ్లి ఆడడం కాదు.. మన గ్రౌండ్ లోకి ప్రపంచాన్ని తీసుకురావాలన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై నైతికత పై చర్చ జరుగుతుందని,…
RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్ వేదికగా దసరా ప్రసంగాన్ని ఇచ్చారు. గత కొన్నేల్లుగా మెరుగైన విశ్వసనీయతతో భారతదేశం ప్రపంచంలో మరింత పటిష్టంగా, మరింత గౌరవంగా మారిందని ఆయన అన్నారు. అయితే, దుష్ట కుట్రలు దేశ సంకల్పాన్ని పరీక్షిస్తున్నాయని శనివారం భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లో భారత్‌కి ముప్పు పొంచి ఉందని, రక్షణగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చేతులు కలుపొచ్చని ప్రచారం జరుగుతోందని అన్నారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. లేకున్నా వ్యక్తిగత, జాతీయ స్వభావాల దృఢత్వం, ధర్మం…
మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారత్‌లో మాట్లాడే ప్రతి భాషా జాతీయ భాషే అని పేర్కొన్నారు. అలాగే, సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కులమతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలన్నారు.
RSS chief: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందువులకు కీలక సూచన చేశారు. హిందువులు తమ సొంత భద్రత కోసం భాష, కులం, ప్రాంతం అనే అన్ని విభేధాలను మరించి వివాదాలను నిర్మూలించడం ద్వారా ఐక్యంగా ఉండాలి అని కోరారు. రాజస్థాన్ బరన్‌లో జరిగి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి భగవంత్ మాట్లాడుతూ.. హిందువులు అన్ని భేదాలను మరించి ఐక్యంగా ఉండాలని సూచించారు.
Aravind Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. తన పదవీ విరమణ సహా 5 అంశాలపై సమాధానం చెప్పాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కి కేంద్రం భద్రతను పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ‘‘జెడ్-ప్లస్’’ కేటగిరి నుంచి మరింత పటిష్టమైన అధునాతన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఏఎస్ఎల్ ప్రోటోకాల్‌కి భద్రతను పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సమానంగా భగవత్‌కి భద్రతను అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది మోహన్ భగవత్‌కి భద్రతను అందిస్తోంది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన రెండో ప్రసంగం కూడా వివాదాస్పదమైంది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డు నుంచి తొలగించారు.