CM Yogi Adityanath: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు , ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ని ఇవాళ (శనివారం) కలవనున్నారు. అయితే, గురువారం గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీపై ఆర్ఎస్ఎస్ బయటికి చెప్పకున్నా కోపంగా ఉందన్నారు. వరసగా ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ అహంకారంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. మణిపూర్ సమస్యపై సోమవారం మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతి నెలకొనలేదని కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్కరు ప్రజాసేవలో వినయంగా వ్యవహరించాలి.. ఇదిలా ఉంటే మరోనేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. అహంకారులుగా వ్యవహరించిన వారిని ఆ శ్రీరాముడు కేవలం 241 వద్దే అడ్డుకున్నాడని మండిపడ్డారు.
Read Also:USA vs IRE: సూపర్ 8కు అమెరికా.. టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ఔట్!
ఇక, ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్దతు తెలపలేదని సమాచారం. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్‌ని బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ పరాజయానికి ఇది ఓ కారణంగా చెప్తున్నారు. యూపీలో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 36 సీట్లను సాధించింది. అందులో భారతీయ జనతా పార్టీ 33 సీట్లకు పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)- కాంగ్రెస్, ఇండియా కూటమి 43 స్థానాల్లో విజయం సాధించింది. అయోధ్య రామాలయాన్ని నిర్మించిన ఫైజాబాద్ ఎంపీ స్థానంలో కూడా బీజేపీ ఓటమిపాలైంది.
Read Also: Charith Maanas: అచ్చం మేనమామ పోలికలే.. వైరల్ గా మారిన మహేష్ బాబు అల్లుడు..
అయితే, ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు బీజేపీ మెజారిటీ మార్కుకు దూరం చేశాయి. గత రెండు (2014, 2019) పర్యాయాలు బీజేపీ యూపీలో 60+కి పైగా సీట్లలో విజయం సాధించింది. దీంతో బీజేపీ మెజారిటీ మార్క్(272)ని దాటింది. ఈసారి మాత్రం బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. అయితే, ఎన్డీయే కూటమి మొత్తంగా 293 స్థానాలు గెలవగా.. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ, జేడీయూ, శివసేనలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు భేటీ కాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.