RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్ వేదికగా దసరా ప్రసంగాన్ని ఇచ్చారు. గత కొన్నేల్లుగా మెరుగైన విశ్వసనీయతతో భారతదేశం ప్రపంచంలో మరింత పటిష్టంగా, మరింత గౌరవంగా మారిందని ఆయన అన్నారు. అయితే, దుష్ట కుట్రలు దేశ సంకల్పాన్ని పరీక్షిస్తున్నాయని శనివారం భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లో భారత్‌కి ముప్పు పొంచి ఉందని, రక్షణగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చేతులు కలుపొచ్చని ప్రచారం జరుగుతోందని అన్నారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. లేకున్నా వ్యక్తిగత, జాతీయ స్వభావాల దృఢత్వం, ధర్మం యొక్క విజయానికి బలమైన పునాదిగా మారుతుందని భగవన్ అన్నారు.
ఒక దేశం దాని ప్రజల జాతీయ స్వభావాన్ని బట్టి గొప్పగా మారుతుందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ ఈ ఏడాదితో శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెట్టినందున ఈ ఏడాది చాలా ముఖ్యమైందని చెప్పారు. భారత్‌తో ఆశలు, ఆకాంక్షలతో పాటు సవాళ్లు, సమస్యలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. సంక్షేమం, ధర్మం, సంస్కృతి, సమాజం కోసం తమ జీవితాలనున అంకితం చేసిన ల్యాబాయి హోల్కర్, దయానంద సరస్వతి, బిర్సా ముండా మరియు మరెన్నో వ్యక్తుల నుండి మనం ప్రేరణ పొందాలని సూచించారు.
ప్రస్తుతం హమాస్-ఇజ్రాయిల్ యుద్ధ వివాదం ఎంత వరకు విస్తరిస్తుందనే ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడాన్ని మోహన్ భగవత్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రభుత్వం మరియు పరిపాలన కారణంగా, ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ట, శక్తి, కీర్తి మరియు స్థానం పెరుగుతోంది. కానీ దేశాన్ని అస్థిరపరిచేందుకు, విఘాతం కలిగించేందుకు దుష్ట కుట్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Read Also: Haryana elections: ఓటమి తర్వాత బాలికలకు ఫ్రీ బస్ సర్వీస్‌ని నిలిపేసిన ఎక్స్-ఎమ్మెల్యే..
బంగ్లాదేశ్‌లో నిరంకుశ ఛాందసవాద స్వభావం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. హిందువులతో సహా మైనారిటీల తలలపై కత్తి వేలాడుతోందని, హిందువులు ఇప్పుడు తమను తాము రక్షించడానికి ముందుకు వచ్చారు అని ఆయన అన్నారు. కలిసికట్టుగా లేకపోవడం, బలహీనంగా ఉండటం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడం లాంటిదని, హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించారు. కోల్‌కతా అత్యాచారం-హత్యను సిగ్గుచేటుగా అభివర్ణించారు మరియు నేరస్థులను రక్షించే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. నేరాలు, రాజకీయాలు, విష సంస్కృతి కలగలిసి సమాజాన్ని నాశనం చేస్తోందన్నారు.
డీప్ స్టేట్, వోకీయిజం, కల్చరల్ మార్కిస్ట్ సంస్కృతీ, సంప్రదాయాలకు శత్రువులుగా ఉన్నాయని భగవత్ అన్నారు. బహుళ-పార్టీ ప్రజాస్వామ్యంలో, పరస్పర సామరస్యం, దేశం యొక్క గర్వం మరియు సమగ్రత కంటే చిన్న స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమైనవిగా చూస్తున్నారని, పార్టీల మధ్య పోటీలో ఈ కీలక అంశాలను ద్వితీయార్థంగా పరిగణిస్తారని ఆయన అన్నారు. జాతీయ ప్రయోజనాల కంటే సమాజంలో చీలికను సృష్టించే ప్రయత్నాలు పెద్దవిగా మారాయి. ఒక పార్టీకి మద్దతుగా నిలవడం, ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో తమ విధ్వంసకర ఎజెండాను ముందుకు తీసుకెళ్లడమే తమ మార్గమని ఆయన అన్నారు.