RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి
- బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ నేత..
- పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను సహించబోం..
- ఈ సమస్యను చర్చల ద్వారా కాకపోతే మరో మార్గంలో పరిష్కరించండి: ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Leader: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నేత సునీల్ అంబేకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరిస్తూ, బాధిత సమాజాన్ని రక్షించడానికి తక్షణమే తగిన కృషి చేయాలన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించవచ్చని నేను ఆశిస్తున్నాను.. కానీ, ఆ చర్చలు ఫలించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మోడీ సర్కార్ గట్టిగా ప్రయత్నించాలన్నారు. మా దేవాలయాలను తగులబెడుతున్నారు.. హిందూ మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి ప్రతి హిందువు ఆగ్రహానికి లోనవాలని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ తెలిపారు.
Read Also: CM Chandrababu: హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి: సీఎం
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింస హిందూ సమాజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లుంది.. ఈ సంఘటనలను ఖండించడం వల్ల పని జరగదని ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను సహించబోమన్నారు. ఇప్పుడు, మనం ఏమీ చేయకపోతే మన భావి తరాలు మన మౌనాన్ని ప్రశ్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌పై కూడా విరుచుకుపడ్డారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నడుపుతున్న దేశంలో శాంతి లేదు అని ఎద్దేవా చేశారు. బంగ్లాదేశ్‌లో ఇబ్బందులను సృష్టించేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు. అలాగే, ఇతర దేశాలలో హిందూ వ్యతిరేక హింసకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేత సునీల్ అంబేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!