RSS Chief: పెరుగుతున్న మందిర్-మసీద్ వివాదాలు.. ఇది ఏమాత్రం మంచిది కాదు..!
- దేశంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరుగుతున్నాయి..
- ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. అందరం కలిసిమెలిసి ఉండాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్
- హిందువులం కూడా రామకృష్ణ మిషన్‌లో క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం: మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Chief: పుణెలో ఇండియా-ది విశ్వగురు అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కలుపుగోలు సమాజాన్ని మోహన్ భగవత్ సమర్థించారు. మన దేశం సామరస్యంగా ఉంటుందనే విషయాన్ని.. ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.
Read Also: Dead Body in Parcel: పార్శిల్‌లో డెడ్‌బాడీ.. పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన!
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
కాగా, ప్రతి రోజూ కొత్త వివాదాలు తీయడంతో వీటిని ఎలా అంగీకరించమంటారని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తెలిపారు. మనం అందరం కలిసిమెలిసి ఉంటాం అనేది ఈ ప్రపంచానికి చూపించాలన్నారు. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం కొనసాగుతుంది.. దీంట్లో సర్కార్ ను నడిపే ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు కూడా పోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నారు.. ఆధిపత్య భాష ఎందుకు?, ఎవరు మైనార్టీ?, ఎవరు మెజార్టీ? అని ప్రశ్నించారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానమే.. ఎవరి ఇష్టమైన దేవుడిని వారు కొలుస్తారని చెప్పుకొచ్చారు. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా ప్రతి ఒక్కరూ జీవించడం అవసరమని మోహన్ భగవత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..