Rahul Gandhi: జాతీయ జెండాకు నమస్కరించని ఆర్ఎస్ఎస్.. దేశం గురించి మాట్లాడుతుంది..
- కాంగ్రెస్ కొత్త భవనం పార్టీ కార్యకర్తలందరికీ చెందుతుంది..
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్రంగా మండిపడిన రాహుల్..
- స్వాతంత్య్రాన్ని కించపరిచేలా భగవత్ మాట్లాడుతున్నారు..
- దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారిని కాంగ్రెస్ మాత్రమే ఆపగలదు..
- ఆర్ఎస్ఎస్, బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భగవత్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం.. అయితే, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దేశ ప్రజలందరినీ అవమానించారు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: Sankrantiki Vastunnam : బుల్లి రాజా కోసమైనా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు పోవాల్సిందే
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ఇక, బ్రిటీష్ వారిపై పోరాడిన యోధులందరినీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కించపరిచారంటూ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇకనైనా ఆర్ఎస్ఎస్ చేసే ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలి అన్నారు. అయితే, కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. తమ పోరాటంలో న్యాయం ఉంది, దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం గురించి స్పందిస్తూ.. ఈ కొత్త భవనం పార్టీ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది అన్నారు.. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెందుతుంది అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!