రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ జనాభా పెరుగుదల రేటు (ఫెర్టిలిటీ రేటు) క్షీణతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని డెమోగ్రఫీ నిబంధనలు చెబుతున్నాయన్నారు.
READ MORE: Bangladesh: హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి.. భారత్ ఎజెంట్ అంటూ ఆరోపణ..
“సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువగా ఉంటే.. ఆ సమాజం నాశనం అవుతుంది. ఆధునిక జనాభా శాస్త్రంలో ఈ అంశం గురించి ప్రస్తావించారు. జనాభా క్షీణత రేటు ఇలాగే కొనసాగితే, అనేక భాషలు, నాగరికతలు అంతరించిపోయే అంచుకు చేరతాయి. మన దేశ జనాభా విధానాన్ని 1998 లేదా 2002 సంవత్సరంలో నిర్ణయించారు. జనాభా పెరుగుదల రేటు 2.1 కంటే తక్కువ ఉండకూడదని పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం మనకు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కావాలి. సమాజ మనుగడకు అవసరం. జనాభా శాస్త్రం కూడా అదే చెబుతోంది.” అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.
READ MORE:Bangladesh: హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి.. భారత్ ఎజెంట్ అంటూ ఆరోపణ..
సంతానోత్పత్తి రేటు తగ్గితే జరుగుతోంది?
సంతానోత్పత్తి రేటు అంటే సగటున ఒక మహిళ జన్మనివ్వగలిగే శిశువుల సంఖ్య. ఈ రేటు గణనీయంగా తగ్గిపోతోంది. ఈ సంఖ్య సుమారుగా 2.1 కన్నా తగ్గిపోతే, జనాభా పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది.1950లో స్త్రీల జీవితకాలంలో ప్రసవాల రేటు సగటున 4.7 ఉండేది. 2017నాటికల్లా ఈ రేటు సగానికి అంటే 2.4 కు పడిపోయిందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యువేషన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం 2100కల్లా ఈ రేటు 1.7కు పడిపోవచ్చని అంచనా.
READ MORE:ICC Chairman Jay Shah: నేటి నుంచే ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్న జై షా
ఫలితంగా 2064 సంవత్సరానికి భూమి మీద మనుషుల సంఖ్య 9.7 బిలియన్లు అంటే 970 కోట్లకు చేరుకుంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2100కి 880 కోట్లకు పడిపోతుందని అంటున్నారు. ఇది చాలా పెద్ద విషయమని, జనాభా సహజంగా తగ్గిపోయే పరిస్థితులవైపు ప్రపంచం ప్రయాణిస్తోందని ప్రొఫెసర్ క్రిస్టోఫర్ ముర్రే అన్నారు. “ఇది అసాధారణమైన విషయం. జనాభా అధిక శాతంలో తగ్గిపోవడమనేది ఊహించడానికే కష్టం. జనసమూహాలను వెతుక్కుని గుర్తుపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.