ఇటు బీజేపీలో, అటు ఆరెస్సెస్ లో మోహన్ భగవత్ 75 ఏళ్లకు విరమణ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. నాగ్ పూర్ లో పుస్తకావిష్కరణలో భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. మోడీ పేరు చెప్పకపోయినా.. ఆయన్ను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, 75 ఏళ్ల వయసు తర్వాత రిటైర్ కావాలని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని ఉపయోగించుకుని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) వంటి పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి.
మోరోపంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ.. ఒకసారి పింగ్లే చెప్పారు: 75వ సంవత్సరంలో మీకు శాలువా పడితే, అది పదవికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు.. దేశ సేవలో పింగ్లే ఎంత నిబద్ధత చూపించారో, వయస్సు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవడం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది.
Mohan Bhagwat: భారతదేశం ప్రపంచ సామరస్యానికి, సంక్షేమానికి దృఢంగా కట్టుబడి ఉన్న సమయంలో, ప్రస్తుతం ప్రపంచం భారతదేశ పవర్‌ని చూసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే ‘‘ప్రేమ భాష’’ అర్థమవుతుందని ఆయన అన్నారు.
Mohan Bhagwat : ఆపరేషన్ సిందూర్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్ దేశ గౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందంటూ ప్రకటించారు. కర్ణాటకలోని బెలగావిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ పహల్గాం బాధితులకు అసలైన నివాళి అంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశ త్రివిధ దళాలను ఆయన ప్రశంసించారు.…
RSS chief: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారతదేశం ఆగ్రహంతో ఉంది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. ముఖ్యంగా, మతం ఆధారంగా ఉగ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి మరీ చంపారు. కల్మా చదవమని, చదవని వారిని వెతికి మరీ పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. హిందువులను ఊచకోత కోశారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేరుకున్నారు. ఈ దాడిపై తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. కశ్మీర్లో జరిగిన హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మతాల మధ్య యుద్ధం కాదని.. ధర్మం, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు.
Mohan Bhagwat: హిందూ సమాజంలో కుల భేదాలు అంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. హిందువులకు ‘‘ఒక ఆలయం, ఒక బావి, ఒక శ్మశానవాటిక" అనే సూత్రాన్ని స్వీకరించడం ద్వారా సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని అన్నారు.
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థలోకి ప్రవేశం గురించి మాట్లాడుతూ.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులుగా భావించే వారికి తప్ప, సంస్థలోకి అందరికి తలుపులు తెరిచి ఉన్నాయని అన్నారు. మతం, కులం, వర్గం వంటి వాటిని బట్టి ఆరాధన పద్ధతులు మారుతుంటాయి,