మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని…
వరుస వివాదాలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒక వైపు డ్రగ్స్ కేసులో ప్రముఖులపై విచారణ జరుగుతోంది. మరోవైపు “మా” అధ్యక్ష ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పటికే “మా” అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీనితో “మా”లోని లొసుగులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి ప్రవేశించడం, బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేయడం వంటి విషయాలు మరిన్ని సందేహాలకు కారణమవుతున్నాయి.…
ఇవాళ కృష్ణాష్టమి! ఈ సందర్భంగా ప్రతి హిందువు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణుడి పాదాలను ఇంటి ప్రాంగణంలో ముద్రలుగా వేసుకునే వాళ్ళు కొందరైతే, తమ చిన్నారులను బాలకృష్ణుడిగా అలంకరిస్తున్న వారు మరికొందరు. సినిమా రంగం కూడా దానికి మినహాయింపేమీ కాదు. హీరో మంచు విష్ణు, ఆయన భార్య విరోనికా రెడ్డి తన కుమారుడు అవ్రామ్ కు బాలకృష్ణుడి వేషం వేశారు. నాలుగేళ్ళ అవ్రామ్ లో కృష్ణుడి కొంటె లక్షణాలు ఉన్నాయంటూ మురిసిపోతున్నారు తాతయ్య మోహన్ బాబు.…
మోహన్ బాబు కు కోపం ఎక్కువ. ఇది అందరూ చెప్పే మాట. అయితే ఆయనకు కోపం ఎందుకొస్తుంది? ఎప్పుడొస్తుంది? అనేది మాత్రం ఆయనతో పనిచేసిన వారికి, సన్నిహితులకు మాత్రమే తెలిసిన సత్యం. సమయపాలన, క్రమశిక్షణ అంటే ప్రాణం పెట్టే మోహన్ బాబు… దానిని పాటించని వారి పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఎంతమంది ముందు అయినా వారిని గట్టిగా మందలిస్తారు. దాంతో ఆయన ఆగ్రహం హైలైట్ అవుతుంది తప్పితే, దాని వెనుక కారణం కాదు. ఇదిలా ఉంటే… నటుడిగా…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ…
“కౌన్ బనేగా క్రోర్ పతి” ఒక ఉత్తేజకరమైన గేమ్ షో. ఇక్కడ పోటీదారులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్లో ప్రారంభమైంది. ఎండెమోల్ షైన్ ఇండియా స్టార్, ఎంఏఏ సహకారంతో తెలుగులో “కౌన్ బనేగా క్రోర్ పతి”ని “మీలో ఎవరు కోటీశ్వరులు”గా నిర్మించింది. అయితే అంతకు ముందే ఈ…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఇటు ప్రకాశ్ రాజ్, అటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇద్దరూ రెండు ప్యానెల్స్ గా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇకపోతే… తమిళ హీరో సిద్ధార్థ్ కు మొదటి నుండి ప్రకాశ్ రాజ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం తెలుగు మీడియాకు సిద్ధార్థ్ కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ప్రకాశ్ రాజ్ చొరవ తీసుకుని, ‘దిల్’ రాజుతో కలిసి వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు. అనేక…
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కాలంలో ఆయనను ట్రోల్ చేస్తున్న వారిపై పిర్యాదు చేయడానికి ఆయన పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు పరువు తీస్తున్నాయని మోహన్ బాబు న్యాయ సలహాదారు సంజయ్ సైబరాబాద్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశారు. Read Also : తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెస్ సదరు యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యక్తిగత లాభాల కోసం…
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.