మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సినిమా టికెట్ ఆన్లైన్ సేల్ పై పవన్ మండిపడ్డారు. వైసీపీ మద్దతుదారుడైన మోహన్ బాబుకి పవన్ చురకలు అంటించారు. సినిమా టికెట్ ఆన్లైన్ విక్రయాలకు ఒకే చెప్తే.. మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా.. ప్రభుత్వమే ఆన్లైన్ లో భర్తీ చేస్తుంది’ అని మీకు ఒకేనా అంటూ పవన్ ప్రశ్నించారు.