ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు రచించిన ‘రామబాణం’ పుస్తకాన్ని ఆలయ ఛైర్మన్ మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘పుస్తకం బాగుంది. ఈ రామబాణం ప్రజాదరణ పొందాలి. అలాగే కరోనా తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అన్నారు. తన పుస్తకం ‘రామబాణం’కు మోహన్ బాబు ముందుమాట చక్కగా రాశారని, ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించటం ఆనందంగా ఉందని అన్నారు పూజారి రాంబాబు.
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇందులో హీరో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా “సన్ ఆఫ్ ఇండియా” ఫస్ట్ సాంగ్…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో కలసి 24 ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా కు డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో మంగవారం ఉదయం విడుదల కానుంది. ‘జయ జయ మహావీర’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సినిమాలో మోహన్ బాబు పాత్రను…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. “నేను మీ మోహన్ బాబు…. 1995 సంవత్సరం నాటికి తెలుగు సినిమా పరిశ్రమ వయస్సు 65 సంవత్సరాలు… 65 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులను తిరగరాసి నా కెరియర్లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం పెదరాయుడు… 1995 జూన్ 15 ‘పెదరాయుడు’ రిలీజ్ అయిన 26 సంవత్సరాల తర్వాత……
(జూన్ 12తో ‘పాలు – నీళ్ళు’కు 40 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ‘గురువుగారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుదే! చిత్రసీమకు దాసరి చిత్రాల ద్వారా పరిచయమైన వారూ, వారి ద్వారా సినిమా రంగంలో రాణించిన వారు – ఇలా దాసరికి ఎంతోమంది శిష్యప్రశిష్యులు ఉన్నారు. వారిలో విలక్షణ నటుడు మోహన్ బాబు స్థానం ప్రత్యేకమైనది. దాసరి తెరకెక్కించిన అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన మోహన్ బాబును హీరోగా నిలపాలని దాసరి…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన తాజా చిత్రం “సన్నాఫ్ ఇండియా” సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవి, అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్య గురించి ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. “నేను సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రాన్ని తీస్తున్నాను అని నా అభిమానులకు, ప్రేక్షకులకి తెలుసు. సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. విష్ణు వెంటనే చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుంది అన్నాడు.…
అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజే హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతo కూడా ఆయనే. ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా…
సీనియర్ నటుడు మోహన్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 4న విడుదల చేయనున్నారు. మోహన్‌బాబు 30 ఏళ్ల కిందట నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ విడుదలైన రోజు అది. ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రత్యేకత వల్లే ఈ నెల…