ఈరోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో ఈ ఎన్నికలు ముగియనున్న ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు రాత్రి 8 గంటలకు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటు ప్యానళ్ల సభ్యుల మధ్య జరుగుతున్న వాగ్వివాదం, లోపల గొడవ పడుతున్న సభ్యులు బయటకు వచ్చాక అసలేమీ జరగలేదనతో కప్పి పుచ్చడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.
Read Also : “మా” ఎలక్షన్స్ : నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం
ఇక ఇప్పటికే పలువురు సభ్యులు, స్టార్ హీరోలు ‘మా’ ఓట్లను వేసి తమ హక్కును వినియోగించుకున్నారు. అయితే ఉదయం ఓట్ వేయడానికి వచ్చిన మోహన్ బాబు బెనర్జీని హెచ్చరించడం సంచలనంగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న సభ్యులు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ‘చంపేస్తా’ అంటూ బెనర్జీకి మోహన్ బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు.