పాపులర్ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’ జెట్ స్పీడ్ తో సరికొత్త షోలతో దూసుకెళ్తోంది. ‘ఆహా’కు, అందులో ప్రసారమవుతున్న షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి దిగ్గజ ఓటిటి సంస్థలు సైతం షాకవుతున్నాయని ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో లాంచ్ చేసిన వేదికపై తెలిపారు. తెలుగు ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ‘ఆహా’. ఇప్పటికే ‘సామ్ జామ్’ అంటూ సమంతను హోస్టుగా మార్చి పలువురు సెలెబ్రటీలతో షో…
గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో… సీనియర్ నటుడు,మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై కేసు పెట్టడం జరిగింది. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్ల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మా…
‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా అయిపొయింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా దీనికి నిదర్శనం. చిరంజీవి తనను ‘మా’ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగమని అడిగారంటూ విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఈ…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు మెగా ఫ్యామిలీపై సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సినిమాలు హిట్, ప్లాఫ్ అవుతుంటాయి. కానీ మేము అంతముంది ఉన్నాం, ఇంత మంది ఉన్నాం అని బెదిరించినా అదరక బెదరక ఓటు వేసి విష్ణును గెలిపించిన మా సభ్యులకు కృతజ్ఞతలు. నాకు రాగ, ద్వేషాలు లేవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా? మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం…
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మా’కు ఎన్నికయిన సభ్యులకు నా అభినందనలు. ఇది ఎంతో సంతోషదాయకమై సందర్భం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద…
ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా…
ఆయన ఏదో ఈక్వేషన్‌తో ఈయనకు మద్దతు ఇచ్చారు. ఈయన గెలిచేశారు. అంతా బాగానే ఉంది. ఈయనేమో.. నేను అప్పుడు అయన అల్లుడికి అంత నష్టం చేసినా… ఆయన మాత్రం మమ్మల్ని గెలిపించారు అంటూ కొత్త మంట పెట్టారు. అక్కడి వరకే పరిమితమైన ఆ ‘మా’ గొడవ ఇప్పుడు రాజకీయంగా తమను ఎక్కడ ఇరకాటంలోకి నెడుతుందోనని ఆ పార్టీ నేతలు గిజగిజ కొట్టేసుకుంటున్నారట. మోహన్‌బాబు కామెంట్స్‌తో ఇరకాటంలో టీడీపీ..! మా ఎన్నికల రచ్చ ఏపీ టీడీపీని తాకింది. మా…
‘మా’ ఎన్నికలు, వాటి తదనంతర ఫలితాలు, కొత్త ప్యానెల్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఓడిపోయిన ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం మరియు ఇతరులు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య మంచు విష్ణు తన తండ్రితో కలిసి వెళ్ళి నందమూరి బాలకృష్ణను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘మా’ ఫలితాల తరువాత తొలిసారిగా బాలకృష్ణను కలిశారు మంచు తండ్రీకొడుకులు. ఎన్నికలకు ముందు బాలకృష్ణ మంచు విష్ణుకే తాను సపోర్ట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టుగానే మంచు…
మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా విజయం తరువాత విష్ణు తనకు మద్ధతు తెలిపిన వారిని కలుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబులు హీరో బాలకృష్ణ ఇంటికి వెళ్లి పలకరించారు. మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బాలయ్యబాబు అల్లుడిని ఓడించడానికి తాను మంగళగిరిలో ప్రచారం చేశానని, మంగళగిరిలో టీడీపీ ఓటమిపాలైందని అన్నారు. అయితే, మా…