మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు మరియు చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులు అని.. మా ఎన్నికల నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మా ఎన్నికల కు ఇంత హడావిడి అవసరం లేదని… సినిమా చేసే వాళ్ళు ఆదర్శంగా ఉండాలని సూచించారు. మా ఎన్నికల కారణంగా సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. తిప్పి కొడితే తొమ్మిది వందల ఓట్లు లేవని… ఇందులో వ్యక్తిగత దూషణలు అవసరమా ? అని ప్రశ్నించారు. ఇలాంటి పోటీ తానెప్పుడూ చూడలేదని ఈ ఎన్నికల కారణంగా నటుల మధ్య చీలిక రాదని కుండ బద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్.