నగుమోము నగ్మా, నగిషీల మహిమ తొలిసారి తెలుగుతెరపై వెలిగింది ‘పెద్దింటల్లుడు’ చిత్రంతో. ఈ సినిమాలోనే ముద్దుగా బొద్దుగా కనిపించిన నగ్మా వచ్చీ రాగానే తెలుగువారిని ఆకర్షించేసింది. సుమన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు. వాణిశ్రీ మరో ముఖ్యభూమికలో అలరించారు. షమ్మీ కపూర్ ‘ప్రొఫెసర్’ చిత్రం పోలికలు ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆ చిత్రాన్నే యన్టీఆర్ హీరోగా ‘భలే మాస్టర్’ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. కాబట్టి మన తెలుగువారికి ‘పెద్దింటల్లుడు’…
సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. రజినీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మోహన్ బాబును కలవకుండా వెళ్ళరు. ఇద్దరి మధ్య అంతటి గాఢమైన స్నేహబంధం ఉంది. తాజాగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ స్నేహితులకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేశారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మోహన్ బాబు, రజనీకాంత్ అంటూ విష్ణు షేర్ చేసిన పిక్స్ లో వారు వైట్ అండ్ వైట్ ధరించారు.…
ప్రముఖ యాంకర్, నటుడు టిఎన్‌ఆర్ ను సోమవారం (మే 10) కోవిడ్ -19 బలి తీసుకుంది. ఈ టిఎన్‌ఆర్ మరణ వార్త మీడియా వర్గాలను, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు టిఎన్‌ఆర్ మరణం బాధను కలిగించింది అంటూ ట్వీట్ చేశారు. “ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహా రావు (#TNR) మరణం నా మనసును కలచివేసింది. ఇతను గతంలో తన ఛానల్ లో నన్ను ఇంటర్వ్యూ చేశారు.…
నేడు మాతృదినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తల్లులతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేస్తూ వారికి ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాతృదినోత్సవం సందర్భంగా వారి తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం…
హిందువులు సెలెబ్రేట్ చేసుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. హిందూ క్యాలెండరు ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజును ‘శ్రీరామనవమి’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రఖ్యాత హిందూ దేవాలయం భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభోగంగా నిర్వహిస్తారు. కాగా శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మహేష్ బాబు, చిరంజీవి, రవితేజలతో పాటు పలువురు నటులు తెలుగు వారికి, తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ అఫ్ ఇండియా’. ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ దేశభక్తి చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ‘సన్ అఫ్ ఇండియా’ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చాలా సర్ప్రైజ్…