ఇవాళ కృష్ణాష్టమి! ఈ సందర్భంగా ప్రతి హిందువు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణుడి పాదాలను ఇంటి ప్రాంగణంలో ముద్రలుగా వేసుకునే వాళ్ళు కొందరైతే, తమ చిన్నారులను బాలకృష్ణుడిగా అలంకరిస్తున్న వారు మరికొందరు. సినిమా రంగం కూడా దానికి మినహాయింపేమీ కాదు. హీరో మంచు విష్ణు, ఆయన భార్య విరోనికా రెడ్డి తన కుమారుడు అవ్రామ్ కు బాలకృష్ణుడి వేషం వేశారు. నాలుగేళ్ళ అవ్రామ్ లో కృష్ణుడి కొంటె లక్షణాలు ఉన్నాయంటూ మురిసిపోతున్నారు తాతయ్య మోహన్ బాబు. అంతేకాదు… కృష్ణుడి వేషధారణలో ఉన్న మనవడి ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సీనియర్ హీరో.