శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రానికి ‘అగ్ని నక్షత్రం’ అనే పేరు ఖరారు చేశారు. విలక్షణ నటుడు సముతిర కని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ ఇతర ప్రధాన పాత్రలుప పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ…
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు.…
మంచు మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లో వైసీపీకి మద్దతిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్‌ను కూడా కలిశారు. అయితే తాజాగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని…
చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ స్వయంకృషితో చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన వారు. వారిద్దరూ కలసి ‘శ్రీరామబంటు’ మొదలు ‘కొదమసింహం’ వరకు అనేక చిత్రాల్లో మిత్రులుగా, శత్రువులుగా నటించి అలరించారు. 35 ఏళ్ళ క్రితం చిరంజీవి, మోహన్ బాబు మిత్రులుగా నటించిన ‘చక్రవర్తి’ కూడా జనాన్ని ఆకట్టుకుంది. తరువాతి కాలంలో చిరంజీవికి ‘యముడికి మొగుడు’, మోహన్ బాబుకు ‘పెదరాయుడు’ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘చక్రవర్తి’ రూపొందడం విశేషం!…
తరగని కళాతృష్ణ, చెరిగిపోని నటనాపిపాస వెరసి నటరత్న యన్.టి.రామారావు అని అంటే అతిశయోక్తి కాదు. తెరపై పట్టువదలని విక్రమార్కునిగా నటించిన యన్.టి.రామారావు నిజజీవితంలోనూ అదే తీరున సాగారు. ఓ సారి తలచుకుంటే, దానిని సాధించేదాకా నిదురపోని నైజం యన్టీఆర్ ది! ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పరిఢవిల్లడానికి కారణమైన సమ్రాట్ అశోకుని పాత్ర పోషించాలన్న తలంపు యన్టీఆర్ మదిలో బ్రహ్మంగారి చరిత్ర చిత్రం రూపకల్పన సమయంలోనే నాటుకుంది. తరువాత రాజకీయ ప్రవేశం, ఆ తరువాత రాజకీయాల్లోనూ ఆయన జైత్రయాత్ర, ముఖ్యమంత్రిగా…
బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడంలోనే అతని రూటు సెపరేటు…
రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. ఎందరో కళాకారులు తిండి, ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలుసు. తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కళాకారుల్ని ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. నృత్య, జానపద కళాకారుల్ని…
(మార్చి 19న నటనిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు)విలక్షణమైన అభినయానికి మారుపేరుగా నిలిచారు డాక్టర్ ఎమ్.మోహన్ బాబు. ఆయన కెరీర్ గ్రాఫ్ లో ఉవ్వెత్తున ఎగసి, ఉస్సూరుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. పలు ఎత్తులు, పల్లాలు చూశారాయన. అసలు తెలుగునాట అలాంటి ఆటుపోట్లు మరో స్టార్ కు ఎదురు కాలేదని చెప్పవచ్చు. అన్నిటినీ చిరునవ్వుతో గెలుచుకుంటూ ముందుకు సాగారు మోహన్ బాబు. 500పై చిలుకు చిత్రాల్లో నటించి, ఈ నాటికీ నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారాయన. ఆయన అభినయంలోని…
మంచు వారబ్బాయి మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఒక పక్క ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే విష్ణు హీరోగా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్‌లోని పవర్ లేడీస్ లో ఒకరైన లక్ష్మి మంచు ఇండస్ట్రీలో తాను కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ ఎదుర్కోవడం గురించి మాట్లాడింది. సీనియర్ నటుడు, టాలీవుడ్ లోని టాప్ నటులలో ఒకరైన మోహన్ బాబు కుమార్తె అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ వంటి దురదృష్టకర పరిస్థితులను తాను ఎదుర్కోవలసి వచ్చిందని లక్ష్మి చెప్పుకొచ్చింది. Read Also : Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్…