ఉక్రెయిన్ -రష్యా యుద్ధంతో అక్కడ వున్న విదేశీ విద్యార్ధులు, పౌరులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థులకు తల్లిదండ్రులకు వర్చవల్ గా ధైర్యం, జాగ్రత్తలు చెబుతూ భారత దేశానికీ మరింత వేగంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ .
ప్రోగ్రాంలో నిర్వాహకులు, ముఖ్య నాయకులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్, ఎంపీ జీవీల్ నరసింహారావు, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి డా బుర్రా వి కృష్ణం రాజ్, నియో ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఉక్రైన్ యూనివర్సిటీ భారత ప్రతినిధి, మరియు ప్రపంచ మానవత్వ కమిషన్ రాయబారి డా దివ్య రాజ్ రెడ్డి పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో పూర్తి ఖర్చు భరించి కేంద్ర ప్రభుత్వం భారత్ కి తీసుకు వస్తోందని బండి సంజయ్ విద్యార్థులకు చెప్పారు. అందుకు ప్రియతమ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఉక్రెయిన్ లో ఉన్నవాళ్ళలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారని జూమ్ కాల్ లో పాల్గొన్న విద్యార్థులు చెప్పారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందవద్దని సంజయ్ ధైర్యం చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు
తీవ్ర ఆందోళనకు గురి కావడం సహజమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పై భరోసా ఉంచాలని సంజయ్ అన్నారు.

ఈ యుద్ధ సమయం లో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన సర్వీసుల ద్వారా భారత్ కు తరలిస్తున్నారు అని బండి సంజయ్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారతీయుల యోగ క్షేమాలకు ప్రధాని అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో విదేశాంగ శాఖ టాస్క్ ఫోర్స్ ప్రతీ క్షణం ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను వెనకీ తీసుకువచ్చే విషహాయం పైనే పనిచేస్తోందని సంజయ్ చెప్పారు.
తనకు అందుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖకు తెలియ జేస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. వందల మంది తల్లి దండ్రులు, ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్ధులతో సంజయ్ మాట్లాడారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ మోడీ స్వదేశానికి తీసుకువస్తారని బండి సంజయ్ భరోసా కల్పించారు. ఇవాళ పార్టీ ఆఫీస్ కు వచ్చిన కొందరు తల్లిదండ్రులకు కూడా సంజయ్ భరోసా ఇచ్చారు.