Rain Alert : గత నాలుగు ఐదు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో యూసఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలలో వరదలు ముంచెత్తి వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో రహదారులపై…
భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టారిఫ్‌ల విషయంలో ఇరు దేశాల మధ్య సఖ్యత చెడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం హై-లెవల్ సమావేశానికి సిద్ధమయ్యారు.
బీసీ బిల్ ఆమోదం కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పోరాడుతోంది. సీఎం రేతంత్ రెడ్డితో సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనగణన లో కులగణన చేశాం.. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో రెండు బిల్లులు చేసి గవర్నర్ కు పంపాము.. స్థానిక సంస్థల్లో 42 శాతం…
TPCC Mahesh Goud : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ మహా ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం వల్ల కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే కాకుండా, ప్రధానమంత్రి మోడీనే పరేషాన్లో ఉన్నాడని ఆయన అన్నారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “సహాసోపేత నిర్ణయం తీసుకోవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం…
CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, “బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. “బీసీ కోటా బిల్లులు కేంద్రం…
కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించారు. అమెరికా విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముగింపునకు రాలేదు. ఇంకా తీవ్ర సందిగ్ధం నెలకొంది.
అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం తెలిపారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అగర్వాల్ ముఖ్య సంధానకర్తగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపారు.