ప్రధాని మోడీ రెండేళ్ల తర్వాత తొలిసారి మణిపూర్‌లో అడుగుపెట్టారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో రాష్ట్రం అట్టుడికింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. భారీ వర్షం మధ్య ప్రధాని మోడీ ఇంఫాల్‌కు చేరుకున్నారు.
ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
చైనా వేదికగా టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా ఆయా దేశాల ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను మోడీ ఆత్మీయంగా పలకించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…