ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రతిష్ట మరింత పెరిగింది. పదేళ్లుగా ప్రపంచ ప్రజలందరూ జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 11వ ఏడాది కార్యక్రమం ఈసారి ఏపీకి ప్రతిష్టాత్మకమైంది. ప్రధాని నరేంద్ర మోడీ…
2023తో పోలిస్తే 2024లో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 37,600 కోట్లు) చేరుకుంది. స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డబ్బులో భారీ పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల సంభవించింది. 2023లో, ఈ మొత్తం నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పడిపోయింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) అధికారిక డేటా…
ప్రధాని మోడీ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లారు. జీ 7 సమ్మిట్‌లో ఉన్న దేశాధినేతలంతా సమావేశానికి హాజరయ్యారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోడీ కూడా కెనడా వెళ్లారు.
Indian Air Force: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని తెలిపింది.
కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరికీ నమస్కారం.. బాగున్నారా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన మాకు ఆదర్శం.. మీ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ సమస్యలు వినే అవకాశం…
ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.
KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మళ్లీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. కంచన్‌బాగ్ – గచ్చిబౌలి మధ్య 400 ఎకరాల భూముల వివాదం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వారికి తావు లేదని అన్నారు. నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న సగటు పౌరుడికి న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది’…
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెనను ప్రారంభించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది. అంతేకాక.. భారత రైల్వే శాఖ ఇంజినీరింగ్ నైపుణ్యతకు ఇది నిదర్శనం. 2కిలో మీటర్లకు పైగా పొడవున్న ఈ వంతెన, రామాయణంలో పేర్కొన్న రామసేతుతో చారిత్రక, సాంస్కృతిక సంబంధం కలిగి ఉందని భావిస్తారు. ఆధునిక పంబన్ వంతెన కేవలం సాంకేతిక విజయం…
శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గోషామహల్ లోని సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. "ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది.