భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 48 గంటల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరిగాయి.
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ అత్యవసర పరిస్థితిని స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి దినంగా అభివర్ణిస్తారు. అత్యవసర పరిస్థితి సమయంలో, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించారు. దీనికి నిరసనగా ప్రతిపక్షాలు, ఆందోళనకారులు స్టెరిలైజేషన్ నుంచి జైలు శిక్ష వరకు పోరాటాలు చేయాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. విశాఖ కలెక్టరేట్ లో యోగాడే గ్రాండ్ సక్సస్ పై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులుతో సమీక్షించారు. విశాఖతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై చర్చించారు. పలు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రతిష్ట మరింత పెరిగింది. పదేళ్లుగా ప్రపంచ ప్రజలందరూ జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 11వ ఏడాది కార్యక్రమం ఈసారి ఏపీకి ప్రతిష్టాత్మకమైంది. ప్రధాని నరేంద్ర మోడీ…
2023తో పోలిస్తే 2024లో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 37,600 కోట్లు) చేరుకుంది. స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డబ్బులో భారీ పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల సంభవించింది. 2023లో, ఈ మొత్తం నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు పడిపోయింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) అధికారిక డేటా…
ప్రధాని మోడీ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లారు. జీ 7 సమ్మిట్‌లో ఉన్న దేశాధినేతలంతా సమావేశానికి హాజరయ్యారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోడీ కూడా కెనడా వెళ్లారు.
Indian Air Force: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని తెలిపింది.
కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరికీ నమస్కారం.. బాగున్నారా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన మాకు ఆదర్శం.. మీ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ సమస్యలు వినే అవకాశం…
ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అన్ని దేశాల నుంచి, ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ వెనుకడుగు వేశారు. దాదాపు 90 రోజుల పాటు సుంకాలను వాయిదా వేశారు.