చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంలో ప్రముఖంగా మోడీ-పుతిన్ కలయిక చాలా హైలెట్‌గా నిలుస్తోంది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మోడీ-పుతిన్ ప్రత్యేకంగా కలుసుకుని చాలా సేపు సంభాషించుకున్నారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా మరొకసారి మోడీ-పుతిన్-జిన్‌పింగ్ మాట్లాడుకున్నారు. ఇక గ్రూప్ ఫొటో దిగేందుకు వెళ్తుండగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా.. కనీసం పట్టించుకోకుండానే మోడీ వెళ్లిపోయారు. గ్రూప్ ఫొటో దిగాక కూడా అలానే చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Earthquake: ఆప్ఘనిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం.. 500 మంది మృతి
ఇక ఎస్‌సీవో సమావేశం తర్వాత ప్రధాని మోడీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఒకే కారులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు ఇప్పటికే అమెరికా కారాలు-మిరియాలు నూరుతోంది. ఇప్పుడు ఏకంగా పుతిన్‌తో మోడీ రాసుకుపూసుకుని తిరగడం మరింత ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
ఇటీవల అలాస్కాలో ట్రంప్‌తో పుతిన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశ విషయాలను ఇప్పటికే ఫోన్‌లో ఇరువురు చర్చించుకున్నారు. ఇప్పుడు తాజాగా ముుఖాముఖిగా కలుసుకున్నారు. ఇక ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం భారత్-చైనా చేసిన ప్రయత్నాలను పుతిన్ అభినందించారు. పాశ్చాత్య దేశాల కంటే ఆసియా దేశాలు ఎక్కువగా కృషి చేశాయని కొనియాడారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో 20 మందికి పైగా విదేశీ నాయకులు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం, ఆర్థిక చట్రాలను బలోపేతం చేయడం, గ్లోబల్ సౌత్ దేశాల సమిష్టి స్వరాన్ని పెంచడంపై దృష్టి సారించారు.