రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. టియాంజిన్‌లో జరుగుతున్న ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను మోడీ ఆత్మీయంగా పలకించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
భారత్‌పై ఏదో కోపం పెట్టుకున్నట్లుగానే ట్రంప్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కక్ష సాధింపులో భాగంగానే భారత్‌పై భారీగా సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది. ఆసియాలో ఒక్క భారత్‌పైనే భారీగా సుంకం విధించారు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగానే ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్, చైనాపై కారాలు.. మిరియాలు నూరుతున్నారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
భారతదేశంపై అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం పరిష్కారం కాకుండా భారతదేశం ఆజ్యం పోస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ శుక్రవారం బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించనున్నారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు మోడీ ప్రచారం నిర్వహించారు.
ప్రధాని మోడీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధపడుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ వైట్‌హౌస్ సందర్శించారు. ట్రంప్‌తో మంచి సంబంధాలు కనిపించాయి.