ఈ దఫా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికైంది హైదరాబాద్. చురుకుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి జరిగే మీటింగ్స్ కోసం బీజేపీ పెద్దలు ఏర్పాట్లపై వరసగా సమీక్షలు చేస్తున్నారు కూడా. సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా.. పని విభజనపై కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది బీజేపీ. కేవలం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసమే ఆ కమిటీల కూర్పు జరిగింది. దాదాపు 30 విభాగాలను గుర్తించి.. అక్కడ ఎవరెవరు.. ఏఏ పనులు…
కేంద్రంలో నరేంద్ర మోడీ తీరుపై మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్. రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధిస్తోంది. రేపు గవర్నర్ బంగ్లా ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. బీజేపీకి అధికారమనే పిచ్చి పట్టింది. విచారించాల్సి వస్తే ముందు బీజేపీ నేతలను విచారించాలన్నారు శైలజానాథ్. భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఏఐసీసీ కార్యాలయానికి పోలీసులను పంపిస్తున్నారు. ఏ రోజైన బీజేపీ కార్యాలయాల జోలికి వెళ్ళామా..? నాగపూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయానికి పోలీసులను పంపితే అన్నీ దొరుకుతాయి.…
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆఫీసుకి విచారణ కోసం రాహుల్ గాంధీ ఈరోజు కూడా వచ్చారు. గత రెండురోజులుగా గంటల కొద్దీ విచారణ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి, బస్సులలో వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు పోలీసులు.’మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?’ అని కాంగ్రెస్ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.…
రాష్ట్రంలో అధికార పార్టీకి, మా చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత లేదన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్ర రహదారులు , జాతీయ రహదారుల మీద ప్రజల్లో చర్చకు వైసీపీ ప్రభుత్వం వస్తుందా? రాష్ట్రంలో దాదాపు 90 వేల కోట్లు పైబడి నిధులతో జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. నేడు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రహదారులకు చేయవలసిన చిన్న…
కెసిఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది.. ఆయన పార్టీ పెట్టుకోవచ్చు అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగాస్త్రం వేశారు. ఉట్టికి ఎగరనేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు కెసిఆర్ పని ఉందని ఎద్దేవ చేశారు. ప్రత్యామ్నాయ శక్తి అంటే కుటుంబ పాలన, అవినీతి నా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని మండిపడ్డారు. మోడీనీ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. బంగారు తెలంగాణ చేశాడు.. ఇక బంగారు భారత దేశాన్ని…
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై ఇక్కడ తీసుకొస్తున్నారన్నారు. అది ప్రజాదర్బార్ కాదని, పొలిటకల్ దర్బార్ అని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్…
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయకుండా…
ప్రస్తుత రాష్ట్రపతిపదవీ కాలం ఈ ఏడాది జులై 24తో ముగియనుండటంతో దేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ ఎలా డిసైడ్ అవుతుంది? తెలుగు రాష్ట్రాలకున్న ఓట్లెన్ని? అసలు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాల బలమెంత? దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ నెల…
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని విఫలమయ్యారని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని మండిపడ్డారు. మీరు తీసుకున్న నోట్ల…