రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విజయనగరంలో ఆయన చీపురుపల్లిలో మాట్లాడుతూ. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుంది…రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. ప్రభుత్వం చెప్పిన నాడు నేడు ఏమయ్యింది. పదో తరగతిలో ఎందుకు అంతమంది ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్ అన్నారు… ఇప్పుడు మెడలు వంచారు… కాళ్ల బేరానికి వచ్చారని దుయ్యబట్టారు.
జగన్ హోదా విషయంలో మెడలు వంచారు. జగన్ చర్యలకు భయపడేది లేదు….చాలా మంది సిఎంలను చూశాను. రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మిస్తానన్నారు. ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. రాష్ట్రంలో 8 లక్షల కోట్ల రూపాయాల అప్పు చేశారు…రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు. అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయి. పన్నులు వేసిన డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఒక్క రైతు బాగున్నాడా….క్రాప్ హాలిడేకు కారణం ఈ ప్రభుత్వ వైఫల్యమే. ఉత్తరాంధ్ర బిసిలు టిడిపికి కంచుకోట….ఒక్క పైసా కూడా వెనుకబడిన వర్గాలకు ఈ ప్రభుత్వం ఖర్చు చెయ్యలేదు. ఉత్తరాంధ్రపై ఎ2కు పెత్తనం ఇస్తారా…ఇప్పుడు సుబ్బారెడ్డిని తెస్తారా? కళా వెంకట్ రావు, ప్రతిభారతి, ఎర్రంనాయుడు వంటి వారికి పదవులు ఇచ్చాం. ఇదీ సామాజిక న్యాయం. రాష్ట్రంలో సామాజిక న్యాయం మొదలు పెట్టింది ఎన్టీఆర్ ప్రభుత్వమే. విధ్వంసాలు వైసిపి చరిత్ర….నవ రత్నాలు కాదు…నవ ఘోరాలు అన్నారు.
రెస్కో సంస్థలో ఉద్యోగాలు అమ్ముకున్నారని స్వయంగా వైసీపీ ఎంపీయే చెప్పారు. దీనిపై విచారణ జరగాల్సిందే. విజయనగరం జిల్లాలో అభివృద్ది జరగలేదు. భూ కబ్జాలు మాత్రం జరుగుతున్నాయి. తోటపల్లి ప్రాజెక్ట్ కాల్వల పనులు కూడా పూర్తి చెయ్యలేదు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఎందుకు రాలేదు. ప్రభుత్వం చెప్పాలన్నారు చంద్రబాబు.
India vs South Africa : ముగిసిన ఇండియా బ్యాటింగ్.. సఫారీల టార్గెట్ 170