బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్‌కు నిరసనగా రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్‌తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్లను సెక్యూరిటీ…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకుని జులై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ సభకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. చరిత్రలో ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. సభకు 10 లక్షల మందికిపైగా…
* భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో అన్ని రైల్వే స్టేషన్లలో భారీ భద్రత * తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు. * నేడు ఛలో అనమర్లపూడికి పిలుపునిచ్చిన టీడీపీ. ఛలో అనమర్లపూడికి అనుమతి లేదంటున్న పోలీసులు. అనమర్లపూడిలో144 అమలులో ఉందంటున్న పోలీసులు. * ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై నెల్లూరులో అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమావేశం.…
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి రాజుకుంటోంది. విపక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసేందుకు నిరాకరించారు జమ్మూ కశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలలో పోటీకి ఎన్సీపీ నేత శరద్ పవార్ అయిష్టత ప్రకటించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షనేతల భేటీలో రాష్ట్రపతి ఎన్నికల కోసం ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్ల పరిశీలించారు. కాశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కొన్నాళ్ళపాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని వెల్లడించారు ఫరూక్ అబ్దుల్లా. రాష్ట్రపతి ఎన్నికల…
మోడీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వరంగల్ బిడ్డ రాకేష్ బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండి పడ్డారు. బీజేపీ కి ఇక శంకర గిరి మాన్యాలే అంటూ విమర్శించారు. మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ జూసిన వారెవ్వరూ బాగు పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి పుట్టగతులు లేకుండా చేస్తామని నిప్పులు చెరిగారు.…
ఆయన పాన్ షాపు సంజయ్..! ఈయన కుర్కురే రెడ్డి.. ! అంటూ.. బండి సంజయ్ , కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బాల్కసుమన్ సెటైర్లు విసిరారు. అగ్ని పథ్ పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి భాద్యత మోడీ సర్కార్ దే.. మరెవ్వరిది కాదని మండిపడ్డారు. ఆర్మీలో చేరడాన్ని దైవ కార్యంగా యువత భావిస్తుందని కొనియాడారు. ఇలాంటి స్కీం ను కూడా మిగతా మూర్ఖపు స్కీం లాగా మోడీ తెచ్చి యువత ఆగ్రహానికి కారణమయ్యారని మండిపడ్డారు.…
రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విజయనగరంలో ఆయన చీపురుపల్లిలో మాట్లాడుతూ. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుంది…రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. ప్రభుత్వం చెప్పిన నాడు నేడు ఏమయ్యింది. పదో తరగతిలో ఎందుకు అంతమంది ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్ అన్నారు… ఇప్పుడు మెడలు వంచారు… కాళ్ల బేరానికి వచ్చారని దుయ్యబట్టారు. జగన్ హోదా విషయంలో మెడలు వంచారు. జగన్ చర్యలకు…
భారతీయ సైనిక దళాల నియామకాల్లో మార్పునకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వద్ద ఆర్మీఅభ్యర్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. రైలు పట్టాల మధ్యలో నిప్పుపెట్టి ఆందోళన చేపట్టారు.…