కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఆర్మీలో కాంట్రాక్ట్ నియామక విధానం లేదని అన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆ యువకుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో రూ.5లక్షల కోట్ల పెన్షన్‌ను సేవ్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఈ స్కీమ్‌తో రక్షణశాఖలో 15శాతం రిక్రూట్‌మెంట్ ఆగిపోతుందని, పాక్, చైనా నుంచి ముంపు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో త్రివిధ దళాల్లో 13 లక్షల మంది సైనికులు ఉన్నారని అన్నారు. మూడు సంవత్సరాల నుంచి దేశంలో రిక్రూట్మెంట్ లేదని గుర్తు చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీమ్ కాంట్రాక్ట్ సిస్టమని గుర్తు చేశారు.
ఈ దేశంలో మాజీ సైనికులకు మోసం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కీమ్ లో ఉద్యోగం పొందిన వారికి ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవని నిప్పులు చెరిగారు. ఈ స్కీం వల్ల దేశ రక్షణకు పెద్ద ప్రమాదం ఉందని, కేవలం ఆరు నెలల ట్రైనింగ్ లో ఉద్యోగం రావడం ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
Geethareddy: ఇది అగ్నిపథ్ కాదు.. అగ్నిపరీక్ష..