టీఆర్ఎస్ నేతలు బావిలో కప్పలా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎద్దేవ చేసారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని జెపీ నడ్డా తెలిపారని అన్నారు. నిన్నటి ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేసారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకం అని మండిపడ్డారు. పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి…
కేసీఆర్ ఎవరు కౌన్ కిస్కా.. అంటూ.. బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నగరంలో పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్ వీడ్కోలు పలికిన అనంతరం ఎయిర్‌పోర్టులో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని , బీజేపీ.. కేసీఆర్ కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు.. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని…
హైదరాబాద్‌లో నిన్న, మొన్న రెండు రోజుల పాటు భారీఎత్తున జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలోని కమలదళంలో అడుగడుగునా ఆ సంతోషం, ఆనందం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో వేదిక పైన వెనక (రెండో) వరుసలోని సరిగ్గా మధ్యలో కూర్చున్న పార్టీ యువ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం డల్‌గా ఉండిపోయారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి అభినందిస్తున్న సమయంలో…
లా అండ్ ఆర్డర్ మాది లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. బీజేపీ కేంద్రం ఏమిచ్చిందో శ్వేతా పత్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణ లో ఆలయాల గురించి మాట్లాడారు కదా.. మరి దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తలసాని. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిడ్గం కొనసాగుతూనే వుందని అన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ…
బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా బీజేపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఎం మోడీ సహా కేంద్ర మంత్రులు ఎవ్వరూ రాష్ట్రానికి ఉపయోగపడే మాట ఒక్కటి కూడా చెప్పలేదని విమర్శించారు. కాగా.. తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాకుండా.. అహ్మదాబాద్ పేరును అదానీబాద్‌గా ఎందుకు మార్చారంటూ ట్వీట్ చేశారు. కాగా.. సభసమావేశాల్లో…
భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీతో నిర్వహించిన విజయ సంకల్ప సభ బాగా విజయవంతమైందని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. లక్షలాది మంది తరలిరావడం.. ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం.. ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరాలు అంబరాన్నంటాయి. అయితే.. మరోవైపు సభ విజయవంతం కావడం బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని…
ఇవాళ రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసీసీ వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణపై ప్రత్యేక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. నిన్న మొదటి రోజు (శనివారం) సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ రాత్రి నోవాటెల్ హోటల్లో బస చేశారు. అయితే.. తెలంగాణలో పాగావేయాలనే ప్రయత్నాలు.. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. read also: godhra…
బీజేపీ లో భారీ చేరికలు మొదలయ్యాయి. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా.. అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా.. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయా.. అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తుంది. అయితే నేడు ఉద్యమ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. అందుకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈనేపథ్యంలో.. తాను బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి…
ప్రధాని మోడీ రథంపై స్వారీ చేస్తున్నట్లుగా కళాకారులు రూపొందించిన పేయింటింగ్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ.. రెండూా అంటూ వేసిన మోడీ ఫోటో ఆసక్తి కరంగా మారింది. పెయింటింగ్ అంతా కాషాయి రంగుతో.. రథం ఏర్పాటు చేసి ఆ రథంలో మోడీ ని కూర్చొని సవారి చేస్తున్నట్లుగా కళాకారులు చిత్రించారు. జూలై 1న నగరానికి వచ్చిన నడ్డా.. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అందులో మోడీ పెయింటింగ్ అందరికి ఆశక్తి…
తెలంగాణ రాష్ట్రంలో అధికార సాధనే లక్ష్యమంటోన్న బీజేపీ ఇవాళ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నేడు సాయంత్రం 6 గంటలకు జరగబోచే విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభ సందర్భంగా జంట నగరాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు వెయ్యి ఆర్టీసీ బస్సులను బీజేపీ బుక్ చేసుకోవడం..జిల్లాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉండటంతో…