Modi-Trump: ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం.. ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై మోడీ రిప్లై
- ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం
- ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై మోడీ రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ప్రధాని మోడీతో కూడా ఫోన్‌లో మాట్లాడానని.. మోడీ గొప్ప స్నేహితుడని.. దీపావళి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. ఇద్దరి మధ్య అద్భుతమైన సంభాషణ జరిగినట్లుగా చెప్పుకొచ్చారు. అనేక విషయాలపై చర్చించినట్లుగా వివరించారు.
తాజాగా ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై ప్రధాని మోడీ స్పందించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీపాల పండుగ నాడు ఫోన్ కాల్ సంభాషణ.. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ రాసుకొచ్చారు.
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ఈ మధ్య పాకిస్థాన్‌తో ట్రంప్ దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైట్‌హౌస్ వేదికగా పాకిస్థాన్ పెద్దలకు పెద్దపీట వేస్తు్న్నారు. ఈ నేపథ్యంలో మోడీ తాజా ట్వీట్ ఆసక్తి రేపుతోంది. అన్ని రకాల ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం ఇరుపక్షాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని.. వాణిజ్య హెచ్చరికలతో యుద్ధాన్ని ఆపినట్లుగా ట్రంప్ పదే పదే చెప్పారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ ఖండించింది. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. ఇక రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. దీంతో అప్పటి నుంచి అమెరికాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల మోడీ బర్త్‌డేకి ట్రంప్ ఫోన్ చేసి విషెస్ చెప్పారు. తాజాగా దీపావళికి కూడా శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మళ్లీ మోడీ-ట్రంప్ మధ్య సంబంధాలు బలపడుతున్నట్లుగా తెలుస్తోంది.
Thank you, President Trump, for your phone call and warm Diwali greetings. On this festival of lights, may our two great democracies continue to illuminate the world with hope and stand united against terrorism in all its forms.@realDonaldTrump @POTUS
— Narendra Modi (@narendramodi) October 22, 2025
#WATCH | Washington DC | US President Donald Trump lights lamps at the White House on the occassion of Diwali
(Source: The White House) pic.twitter.com/fFBTU5KyMl
— ANI (@ANI) October 21, 2025
#WATCH | Washington, DC | On being asked by ANI if tariffs would be imposed on China for buying crude oil from Russia, US President Trump says. "… Right now, as of November 1st, China will have about 155% tariffs put on it. I don't think it's sustainable for them. I want to be… pic.twitter.com/WGtOBK3HiF
— ANI (@ANI) October 21, 2025
#WATCH | Washington DC | US President Donald Trump says, "I love the people of India. We're working on some great deals between our countries. I spoke to Prime Minister Modi today and we just have a very good relationship. He's not going to buy much oil from Russia. He wants to… pic.twitter.com/BtdXfkz1eK
— ANI (@ANI) October 22, 2025
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!