యాదాద్రి జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అతను తన తల్లిని కొట్టడమే. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడున్న…
ప్రధాని మోడీ-యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండు రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
Pakistan: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. భారతదేశ ‘‘హిందుత్వ’’ తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదమని అబద్ధాలను ప్రచారం చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం అని చెబుతూ, జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ సంఘటనను ప్రస్తావిస్తు ‘‘హిందుత్వ తీవ్రవాదం’’ ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు.
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే కలవబోతున్నారు. అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ, ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారతదేశానికి, ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌పై ఆంక్షలు విధించినట్లు చెప్పుకొచ్చారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార రంగాలలోని ప్రముఖులు సినిమా నటులతో ఇతర దేశాల అధ్యక్షులతో పాటు కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు నరేంద్ర మోడీ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. వారిలో ఎవరెవరు ఏమన్నారంటే.. JR NTR : అత్యంత శ్రద్ధాసక్తుడు మరియు అంకితభావం కలిగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.…
ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది.
ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులంతా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వరకు.. ఇలా నాయకులంతా శుభాకాంక్షలు చెప్పారు.